కామ్రేడ్ టాక్ – హీరోలు రిలాక్స్?

0

టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిన తరుణంలో సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రభావం మాములుగా ఉండటం లేదు. సినిమా అయినా రాజకీయంగా ఇంకేదైనా సామాజిక సమస్య అయినా క్షణాల్లో వైరల్ అవుతూ కొన్నిసార్లు ఏకంగా కొత్త పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఫలితానికి సంబంధించిన చర్చ హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ దేవరకొండ దీని ప్రమోషన్ విషయంలో చేసిన హంగామా తెలిసిందే. పైగా మీడియం రేంజ్ హీరోలకు ఇప్పటికీ అందని ద్రాక్షలా ఉన్న 60 కోట్ల షేర్ ని గీత గోవిందంతో ఓసారి అందుకున్న విజయ్ మరోసారి అది రిపీట్ చేయాలన్న టార్గెట్ తో చాలా కసిగా దీన్ని జనంలోకి తీసుకెళ్లాడు. నిజంగా దీనికి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చి ఉంటే అది జరిగేదే కానీ డివైడ్ టాక్ ఇప్పుడు చేటు చేస్తోంది

ఇప్పుడు ఈ పరిణామం పట్ల 40 కోట్ల దాకా మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోలు రిలాక్స్ అవుతున్నారని తమ మార్కెట్ మీద విజయ్ ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తాడోనని టెన్షన్ పడిన వీళ్లకు ఇప్పుడు డియర్ కామ్రేడ్ టాక్ టెన్షన్ ను తగ్గించిందని ఇలా రకరకాలుగా ఆన్ లైన్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా వాళ్ళలా ఫీలయ్యారో లేదో కానీ వీటి గురించి డిస్కషన్ లో ఉన్నవాళ్లు అంతకన్నా ఎక్కువే రియాక్ట్ అవుతున్నారు.

వాస్తవానికి గతంలో విజయ్ దేవరకొండ స్టార్ డం గురించి జరిగిన చర్చలో నితిన్ – నిఖిల్ లాంటి హీరోల పేర్లు బయటికి వచ్చాయి. అలాంటిదేమి లేదన్న క్లారిటీ వాళ్ళు తర్వాత ఇచ్చారు అది వేరే విషయం. ఇప్పుడు మాత్రం వెరైటీగా ఇంకో ఇద్దరి పేర్లు రావడం కొసమెరుపు. ఇలాంటివి టాక్స్ రచ్చ చేయడం మాములే కానీ ఈ వీక్ ఎండ్ అయ్యాక డియర్ కామ్రేడ్ రియల్ స్టేటస్ తెలియనుంది
Please Read Disclaimer