హీరోగారు పైలెట్ ట్రైనింగ్ పాజిబులేనా?

0

మిషన్ ఇంపాజిబుల్ హీరో టామ్ క్రూజ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. భారతదేశంలోనూ టామ్ కి వీరాభిమానులున్నారు. ఇక ఈ హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫేవరెట్ అన్న సంగతి తెలిసిందే. అందుకే టామ్ ఏ సినిమా చేసినా మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగానే చూస్తుంటారు. మల్టీప్లెక్స్ ఆడియెన్ లో టామ్ క్రూజ్ కి ఉన్న ఫాలోయింగ్ అసాధారణమైనది.

మిషన్ ఇంపాజిబుల్- మైనారిటీ రిపోర్ట్- ది లాస్ట్ సమురాయ్- వార్ ఆఫ్ ది వరల్డ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో హాలీవుడ్ లో తిరుగులేని అగ్ర హీరోగా నిలిచారు టామ్ క్రూజ్. అంతేకాదు ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లని రాబట్టాయి. తన కెరీర్ లో టాప్ 50 హాలీవుడ్ మూవీస్ జాబితాలో నిలిచిన సినిమాలు ఉన్నాయి. మిలియన్ ట్రిలియన్ డాలర్లను కొల్లగొట్టడం టామ్ నటించిన సినిమాల ప్రత్యేకత. కెరీర్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్లని రాబట్టిన హీరోగా.. హాలీవుడ్ లోనే అత్యధిక పారితోషికం అందుకునే స్టార్ గా నిలిచిన టామ్ క్రూజ్ నిర్మాతగా తన అభిరుచి చాటుకుంటున్నాడు. మరోవైపు రియల్ లైఫ్ లోనూ ఆయన ఓ జెట్ విమానం ఉంది. దాన్నిస్వయంగా డ్రైవ్ చేస్తుంటాడు. ఫ్లైట్ ని నడపడంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఏకైక స్టార్ అతడు.

కేవలం రియల్ లైఫ్ లోనే కాదు… రీల్ లైఫ్ లోనూ ఫ్లైట్ నడిపిన ఘనాపాటి. అతడు అంతటి తో ఆగడం లేదు. కోస్టార్లకు పైలట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు. ఇదంతా తాను నటిస్తున్న తాజా సినిమా ‘టాప్ గన్’ సీక్వెల్ కోసం. 1986లో వచ్చిన యాక్షన్ డ్రామా`టాప్ గన్` లో టామ్ హీరోగా నటించారు. దాదాపు 25ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా `టాప్ గన్ 2′ రూపొందుతోంది. ఇందులో టామ్ ఫ్లైట్ ట్రైనర్ గా కనిపించబోతున్నాడు. మెయిన్ లీడ్ రోల్ లో గ్లెన్ పావెల్ తోపాటు మైల్స్ టెల్లర్- జెన్నీఫర్ కన్నేలీ- జాన్ హమ్ నటిస్తుండటం విశేషం. పావెల్ తోపాటు మరికొంత మందికి ఫ్లైట్ ట్రైనింగ్ ఇస్తున్నాడు టామ్. సినిమాల్లోనే కాదు సినిమా కోసం శిక్షణలో కూడా టామే శిక్షణ ఇస్తుండటం విశేషం. జోసెఫ్ కొనిస్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి టామే నిర్మాత కావడం విశేషంగా చెప్పుకోవాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-