కరోనా బారిన పడ్డ స్టార్ కపుల్ కు చికిత్స

0

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు 150 దేశాలకు పైగా విస్తరించింది. అత్యంత స్పీడ్ గా విస్తరిస్తున్న ఈ వైరస్ బారిన ఎంతో మంది ప్రముఖులు కూడా పడ్డారు. సామాన్యుల కంటే ప్రముఖులకు ఎక్కువగా ఈ వైరస్ సోకుతుందని అంటున్నారు. విమాన ప్రయాణాలు చేసే వారు.. అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్న వారు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ హాంక్స్ ఇంకా ఆయన భార్య రీటా విల్సన్ లు ఇద్దరు కూడా కరోనా బారిన పడ్డారు.

ప్రస్తుతం వీరికి ఆస్ట్రేలియాలో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాను కరోనాతో బాధపడుతూ ఆస్ట్రేలియాలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లుగా టామ్ హాంక్స్ పేర్కొన్నాడు. కరోనా కారణంగా తాను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వెజిటేరియన్ ఫుడ్ అయిన వెజిమైట్ ను తింటున్నట్లుగా సోషల్ మీడియాలో టామ్ హాంక్స్ పోస్ట్ చేశాడు.

వెజిమైట్ ఫొటోను షేర్ చేయడంతో పాటు ప్రస్తుతం దీన్ని తినేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. నాకు కరోనా సోకిన విషయం తెలిసి బాధ పడి నా యోగ క్షేమాల గురించి విచారించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అన్నాడు. ప్రస్తుతం టామ్ హాంక్స్ ఇంకా రీటా విల్సన్ లు కరోనా నుండి రికవరీ అవుతున్నట్లుగా ఆస్ట్రేలియాలో ఐసోలేషన్ వార్డులో వీరికి చికిత్స అందిస్తున్న వైధ్యులు చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-