సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని కాంబినేషన్…!

0

సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘హీరో – హీరోయిన్’.. ‘హీరో – డైరెక్టర్’.. ‘డైరెక్టర్ – మ్యూజిక్ డైరెక్టర్’.. ఇలా కాంబినేషన్స్ సెట్ చేస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ ఏ. కోదండ రామిరెడ్డి లది వెండితెరపై తిరుగులేని సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో 23 చిత్రాలు రిలీజ్ అవ్వగా దాదాపు అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించనవే. చిరంజీవి – కోదండరామిరెడ్డి కలయిలో వచ్చిన తొలి చిత్రం ‘న్యాయం కావాలి’. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ ప్లే చేసారు. 1982లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా నిలిచింది. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘కిరాయి రౌడీలు’. చిరంజీవితో పాటు రాధిక శరత్ కుమార్ మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా మంచి విజయం సాధించింది.

చిరంజీవి – కోదండ రామిరెడ్డి కలయికలో వచ్చిన నాల్గవ చిత్రం ‘అభిలాష’. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిస్తూ ఉరిశిక్షను రద్దు చేయాలనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత వీరి చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమా అప్పటికి తెలుగు సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది. చిరంజీవి కెరీర్ ని ఛేంజ్ చేసిన చిత్రంగా ‘ఖైదీ’ నిలిచిపోయింది. అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోగా ఉన్న చిరంజీవి ఈ సినిమాతో స్టార్ హీరో అయ్యారని చెప్పవచ్చు. దీంతో వీరు ఏ సినిమా తీసినా హిట్ అనే ముద్ర పడిపోయింది.

ఈ క్రమంలో వీరు ‘గుండా’ అనే సినిమా తీశారు. చిరంజీవి – రాధా హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో ‘ఛాలెంజ్’ సినిమా వచ్చింది. సుహాసిని మణిరత్నం – విజయశాంతి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో చెప్పుకోదగ్గ మూవీగా నిలిచిపోయింది. ఇక చిరంజీవి – కోదండరామిరెడ్డి కలయికలో ‘దొంగ’ ‘రక్త సింధూరం’ లాంటి యావరేజ్ సినిమాలు వచ్చాయి. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ‘విజేత’ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో ‘దొంగ మొగుడు’ ‘రాక్షసుడు’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

చిరంజీవి – ఏ.కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన పదిహేడో చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు చిరంజీవి టాలీవుడ్ నెంబర్ హీరోగా సుప్రీమ్ హీరో అనిపించుకునేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త రకమైన డ్యాన్స్ మూమెంట్స్ పరిచయం చేసిందీ చిత్రం. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ ‘కొండవీటి దొంగ’ వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. వీరి కాంబోలో వచ్చిన లాస్ట్ మూవీ ‘ముఠామేస్త్రి’. 1993లో వచ్చిన ఈ సినిమా తర్వాత కోదండరామిరెడ్డి – చిరంజీవి కలిసి సినిమా తీయలేకపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవి వెలుగొందడానికి కోదండరామిరెడ్డి చిత్రాలు ముఖ్యపాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Please Read Disclaimer