టాప్ కమెడియన్.. కానీ అమెరికాలో చీప్ ప్రవర్తన!

0

అందరూ డీసెంట్ గా ఉండేవారే అయితే #మీటూలు గట్రా ఎందుకు ఉంటాయి చెప్పండి? ఫిలిం ఇండస్ట్రీలో కూడా అంతే పైకి ఎలా కనిపించినా.. ఎన్ని ఫిలాసఫీలు చెప్పినా కొందరు మాత్రం లోపల మాంఛి రసికులు. అయితే వారికి తగ్గ.. ఫ్రీక్వెన్సీని కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరికితే సమస్య ఉండదు. కానీ ఒక్కోసారి వారు ఎక్కడికో తీసుకెళ్లాలని మహిళల స్థాయిని పెంచాలని అనుకుంటారు కానీ కుదరదు. అప్పుడే వివాదాలు.. సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఒక టాప్ తెలుగు కమెడియన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైందట.

సదరు కమెడియన్ కు గతంలో కూడా ఇలాంటి విషయాల్లో ఘనచరిత ఉందట. షూటింగ్ లోకేషన్స్ లో గిల్లడం గిచ్చడంలాంటి సరసాలు చేయడం.. అప్పుడపుడు చివాట్లు తినడం జరిగేవట. తాజాగా ఈ హాస్య నటుడు తెలుగు సంఘం సభల కోసం అమెరికాకు వెళ్ళాడట. తెలుగు సభలు జరిగే సమయంలోనే మరో ఈవెంట్ కు ఈయనకు ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్ళడం జరిగిందట. ఆ కార్యక్రమంలో ఒక మహిళ అధునిక వస్త్రధారణతో.. చలాకీగా కనపడేసరికి మాట్లాడడం మొదలుపెట్టాడట. ఆ వివాహితతో మొదట్లో సంభాషణ బాగానే ఉన్నా లిక్కర్ దేవత ప్రభావం చూపించడంతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చి తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో పెద్ద గొడవ జరిగిందట. వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యరట.

ఇదో పెద్ద హంగామా అయ్యేలా ఉండడంతో నిర్వాహకులు ఆ మహిళా కుటుంబ సభ్యులను బ్రతిమాలి.. కేసు పెడితే లేనిపోని హంగామా అవుతుందని.. ఈ సారికి క్షమించి వదిలేయమని నచ్చ చెప్పారట. దీంతో మన నాటీ కమెడియన్ బైటపడ్డాడట. ఒకవేళ వాళ్ళు కనుక కేసు పెట్టి ఉంటే అమెరికా జైల్లో గడపడమే కాదు.. ఇక శాశ్వతంగా అమెరికాకు రానివ్వకుండా ఆయన వీసాను క్యాన్సిల్ చేసి ఉండేవారని అంటున్నారు.
Please Read Disclaimer