‘వెబ్ సిరీస్’ల వైపు మళ్లుతున్న స్టార్ డైరెక్టర్లు.. అందుకేనా..?

0

Top Directors Eyeing Web Spaceకాలంతో పాటు మనుషుల అభిరుచులు కూడా మారిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులను గమనించి ముందుకెళ్లిన వారే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నష్టాల పాలవుతుంది. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ఆహా లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కథ స్క్రీన్ ప్లే బాగుంటే కోట్లలో బిజినెస్ నడుస్తుండటంతో నిర్మాతలు కూడా ఓటీటీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.భారీ నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టడంతో భవిష్యత్తు వెబ్ సీరీస్ లదే అని సినీ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు పడే కష్టం తక్కువ. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ క్రిష్.. త్వరలో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుండగా.. ఆహా కోసం పలు వెబ్ సిరీస్ లకు రచనా సహకారం అందిస్తున్నాడని తెలుస్తోంది. మరో దర్శకుడు తేజ ఒక ప్రముఖ సంస్థతో వెబ్ సిరీస్ ఒప్పందం కుదుర్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమా ఆగిపోవడంతో వెబ్ సిరీస్ వైపు రానున్నాడట. అల్లు అరవింద్ పిలుపు మేరకు వంశీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట.అలాగే పూరీ జగన్నాథ్ కూడా వెబ్ సిరీస్ ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఏ ఓటిటికి తీస్తాడో తెలియదు. అంతేగాక.. సురేందర్ రెడ్డి.. రాహుల్ రవీంద్రన్ కూడా వెబ్ సిరీస్ లైన్లో ఉన్నారు. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు రిపీట్ వాల్యూ తక్కువ.

ప్రస్తుతం కరోనా వల్ల సినిమాలకు కొన్నాళ్లు డిమాండ్ తగ్గినా భవిష్యత్తులో మాత్రం సినిమా పూర్వ వైభవాన్ని దక్కించుకుంటుందని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఖాళీగా ఉండేబదులు వెబ్ సిరీస్ అయినా తీద్దామని అనుకుంటున్నారట టాలీవుడ్ డైరెక్టర్లు. చూడాలి మరి త్వరలో ఓటిటిలో మెప్పిస్తారేమో..!
Please Read Disclaimer