పెట్ డాగ్స్ ఫుడ్డు.. ప్రెట్టీ భామల ప్రమోషన్స్

0

పెంపుడు జంతువులను పెంచుకునేవారు మన దేశంలో చాలామందే ఉంటారు. పాశ్చాత్య దేశాలలో సాధారణమైన జీవులతో పాటుగామరీ వింత వింత జంతువులను పెంచుకునే జనాలు ఉన్నారు కానీ మన భారత దేశంలో మాత్రం ఎక్కువగా కుక్క.. పిల్లి.. కోడి.. లాంటి పెంపుడు జంతువులే ఎక్కువ. కొంతమంది భర్తలను కూడా పెంచుకుంటారు.. అయినా అది వేరే టాపిక్ కాబట్టి ఇక్కడికిక్కడే కట్ చేద్దాం.

ఎన్ని పెంపుడు జంతువులు ఉన్నా వాటన్నిటికి కింగు లాంటిది శునకం. సాధారణ వీధి కుక్కతో మొదలు పెడితే లేబ్రడార్.. జెర్మన్ షెపర్డ్.. పగ్.. గోల్డెన్ రిట్రీవర్.. గ్రేట్ డేన్.. బాక్సర్..ఇలా కుక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. సాధారణ కుక్కలేమో కానీ కాస్ట్లీ బ్రీడ్స్ డాగ్స్ మనలాగా పిచ్చ ఆయిల్ లో ఫ్రై చేసిన బొండాలు.. బజ్జీలు..అస్సలు తినవు. ఒకవేళ అవి తినేందుకు ఆసక్తి చూపినా వాటిని ప్రాణానికన్నా ఎక్కువగా చూసుకునే యజమానులు అస్సలు పెట్టరు. అందుకే డాగ్ ఫుడ్ లో పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. కొత్తవి వస్తున్నాయి. మరి ఆ కంపెనీల ఉత్పత్తులే వాడాలంటే.. వాటిని జనాలు ఎగబడి కొనాలంటే సెలబ్రిటీలు పబ్లిసిటీ చేయాలిగా! తాజాగా డ్రూల్స్ కంపెనీ వారు ప్రముఖ హాటు బ్యూటీల చేత ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఆ బ్యూటీలు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ పెట్ డాగ్స్ తో పోజులిస్తూ వాటికి మురిపెంగా డ్రూల్స్ వారి రియల్ చికెన్ నగ్గెట్స్ తినిపిస్తూ… యమా టేస్టీ అని ఆ పప్పీల చేత ఎక్స్ ప్రెషన్ ఇప్పిస్తూ వీలైనంతగా ప్రమోషన్ చేస్తున్నారు.

డ్రూల్స్ కు జోరుగా ప్రమోషన్ చేస్తున్న హాటు బ్యూటీల లిస్టులో దిశా పటాని.. రకుల్ ప్రీత్ సింగ్.. పూజా హెగ్డే.. నేహ శర్మ లాంటి హేమాహేమీలు ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న మొదటి పెటు దిశా పటాని. ఆమె కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ బ్రాండ్ ను ఇక్కడి నుంచి ఎక్కడి.. కో తీసుకుపోయింది. ఇప్పుడు ఈ డ్రూల్స్ పై ఫోకస్ చేసింది. కుక్కలు.. సారీ పప్పీలు అన్ని చొంగ కార్చుకుంటూ మాకు డ్రూల్స్ కావాలి. మిగతా బ్రాండ్స్ వద్దు.. అని ఇకపై మారాం చేయడం ఖాయమే. ఆలా అని మిగతా బ్యూటీల ప్రమోషన్ పనిచేయదని కాదు.. వారి దెబ్బకు కూడా పెట్ డాగ్స్ అన్ని తోకలు ఊపుకుంటూ డ్రూల్స్ కోసం క్యూ లో నిలబడడం ఖాయమే.
Please Read Disclaimer