వెబ్ సిరీస్ బాటలో టాప్ 10 హీరోయిన్స్

0

అందాల కథానాయికలుయ ఒక్కొక్కరుగా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. ఎవరికి వారు సినిమాలకు సంతకాలు చేస్తూనే సొంత ఓటీటీ వేదికల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టే ఆలోచనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ముందస్తుగా ఓటీటీ వేదికపై పలు టాప్ రేంజు సంస్థలతో కలిసి అనుభవం కోసం పని చేస్తున్నారట. వెబ్ సిరీస్ లలో నటించడానికి ప్రధాన కారణం కేవలం పారితోషికం మాత్రమే కాదు.. ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయన్న లీకులు అందుతున్నాయి.

భారీ బడ్జెట్లతో భారీ చిత్రాలు నిర్మించేంత సాహసం చేయాల్సిన పని లేకపోవడంతో కథానాయికలే సొంతంగా ఓటీటీ వేదికలు పెట్టుకుని కొత్త ట్యాలెంటుకు అవకాశం కల్పించి పరిమిత బడ్జెట్ వెబ్ సిరీస్ లతో ఆదాయం ఆర్జించే ప్లాన్ లో ఉన్నారట. ఇక సొంత వేదికపై సినిమాలు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఈ దిశగా ఇప్పుడు అందాల నాయికలు అడుగులు వేస్తున్నారట. ఆ కోవలో చూస్తే పలువురు టాప్ రేంజ్ కథానాయికలు కొత్త ఎత్తుగడలతో సరికొత్త ప్రాణాళికలతో దూసుకెళుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకూ అలా ప్రయత్నించిన నాయికలు ఎందరున్నారు? అన్నది ఆరాతీస్తే..

అక్కినేని కోడలు సమంత వెబ్ సిరీస్ బాటలో అడుగుపెట్టారు. ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో నటిస్తున్నారు. తనకంటూ సొంత ఓటీటీ వేదికను రెడీ చేసుకోవాలన్న ఆలోచన సామ్ కి ఉందట. అలాగే అమలాపాల్ ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఓటీటీ వేదికపై అదృష్టం చెక్ చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఇంతలోనే మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించిందట. ప్రఖ్యాత వికటన్ గ్రూప్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగుకి వస్తుంది. దర్శకుడు సహా ఇతరత్రా కాస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇక లేటెస్టుగా శ్రీదేవి నటవారసురాలు జాన్వీ ఇదే దారిలోకి వచ్చేస్తోంది. ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ను తాను చేస్తున్నాను అని.. అది 2020 జనవరి 1 అర్థరాత్రి సమయంలో నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లుగా జాన్వీ కపూర్ ప్రకటించింది.

రాధిక ఆప్టే- నీహారిక కొణిదెల- ఇషా రెబ్బా – ప్రియమణి- మంజరి ఫడ్నిస్- స్వరా భాస్కర్.. వీళ్లంతా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. పలువురు అగ్ర హీరోలు వెబ్ సిరీస్ బాటలో సీరియస్ ఎటెంప్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ సహా పలువురు హీరోలు వెబ్ సిరీస్ ఆలోచనల్లో ఉన్నారు.
Please Read Disclaimer