వల వలా ఏడ్చిన అగ్ర నిర్మాత.. కారణం?

0

అతిలోక సుందరి శ్రీదేవిపై సత్యార్ధ నాయక్ రచించిన `శ్రీదేవి`.` ది గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్` పుస్తకాన్ని బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె ఢిల్లీ వేదికగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆవిష్కరణకు విచ్చేసిన ప్రముఖులంతా అతిలోక సుందరితో తమ అనుభవాలను.. అనుభూతులను పంచుకున్నారు. అనంతరం బోనీకపూర్ మాట్లాడుతూ భార్య జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక సమయంలో ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు.

దీంతో బోనీ కపూర్ పక్కనే నుంచొని ఉన్న దీపిక పదుకునే ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేసారు. బోనీ కంట కన్నీళ్లు ఉబికివస్తోన్న సమయంలో దీపికా ఆయన్ని ఆలింగనం చేసుకుని కొన్ని సెకెన్ల పాటు ఆయన్ని ఓదార్చింది. ఒక రకంగా బోనీని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపించింది. కాసేపటికి బోనీ వద్ద నుంచి బయటకు రాగానే దీపిక మైక్ అందుకుని శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. శ్రీదేవితో తనకున్న వ్యక్తిగత పరిచయాన్ని..కొన్ని సందర్భాల్లో శ్రీదేవి ఎలాంటి సందేశాలు పంపించేది! అన్న విషయాలు దీపికా తెలిపింది.

అత్యంత ఎక్కువగా ఇష్టపడే వ్యక్తుల్లో శ్రీదేవి ఒకరని.. ఆమె ప్రతీ చిత్రంలో ఓ గొప్ప నటిని చూసాననిని అంత లెజెండరీ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు దీపిక కూడా కాస్త ఎమోషనల్ అయింది. తన కంటా కన్నీరు కనిపించింది. ఇలా శ్రీదేవి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎంతో భావోద్వేగంతో ముడిపడింది. ప్రస్తుతం దీపిక పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో ఓ పెళ్లికి వెళ్లి మామ్ శ్రీదేవి బాత్ టబ్ లో కాలు జారి మరణం చెందారన్న ప్రచారం విధితమే. అభిమానుల్ని ఇప్పటికీ కలచి వేసే దుర్ఘటన ఇది. శ్రీదేవి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు బోనీపై నెపం వేయడం .. అనంతరం దుబాయ్ పోలీస్ అది యాక్సిడెంటల్ డెత్ అని ధృవీకరించడం తెలిసిందే. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం అనుమానాలు పెనుభూతాలను భరించలేని బోనీ కపూర్ పలు సందర్భాల్లో మీడియా ముందే కంటతడి పెట్టారు. మరోసారి ఆయన ఇంత ఎమోషన్ అవ్వడానికి కారణం .. ఆ సంఘటనలు స్ఫురణకు రావడమేనని పలువురు భావిస్తున్నారు.
Please Read Disclaimer