టాప్ స్టోరి: 2020 టాలీవుడ్ క్రేజీ సినిమాలివే

0

పాతను వదిలి కొత్తను ఆహ్వానించే తరుణమిది. 2019కి బాయ్ చెప్పి.. 2020లో ప్రవేశించాం. కొత్త సంవత్సరం సినిమాల సంగతేంటి. థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాలు ఏవి రిలీజ్ కి వస్తున్నాయి? అంటే.. 2019 కంటే 2020 యాక్షన్ ప్యాక్డ్ సినిమాలతో ఆకట్టుకోబోతోందని సన్నివేశం చెబుతోంది. ఒక విధంగా చూస్తే ప్రతిష్టాత్మకమైన చిత్రాలతో ఈ ఏడాది సినీ ఉత్సవంగా మారే అవకాశాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి. సంక్రాంతి రేసు నుంచి ఈ ఇయర్ అసలైన సందడి మొదలవుతోంది. దర్బార్- సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురములో వంటి భారీ చిత్రాలతో ఈ ఏడాది సినిమాల రేస్ మొదలవుతోంది. ఈ మూడూ క్రేజీ స్టార్లతో తీసిన భారీ చిత్రాలు. జనాల్ని థియేటర్లకు రప్పించే సినిమాలుగా భావిస్తున్నారు.

అటుపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రాబోతోంది. ఎన్టీఆర్- రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రమిది. ఫిక్షన్ పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆదివాసీ ఉద్యకారుడు కొమరం భీమ్ గా.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అజయ్ దేవ్ గన్- అలియాభట్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలే వున్నాయి. చిరు కొరటాల శివ కలయికలో రాబోతున్న సినిమా ఇటీవలే మొదలైంది. తొలిసారి ఈ ఇద్దరు కిసి చేస్తున్న సినిమా కావడం తో దీని పై కూడా భారీ క్రేజే వుంది.

బాహుబలి- సాహో చిత్రాల తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం `జాన్`. పిరియాడిక్ లవ్ స్టోరీ గా రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా కొత్త పంథాలో తెరపైకి రాబోతోంది. `పింక్` పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. దీనిపై కూడా అంచనాలు భారీగానే వున్నాయి. ఇక అల్లు అర్జున్- సుకుమార్ కలయిక లో ముచ్చట గా మూడవ సినిమా రాబోతోంది. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో అత్యంత సహజత్వంగా ఈ సినిమా వుండబోతోందట. రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్`పై కూడా మామూలు బజ్ లేదు. ఓ రేంజ్ లో వినిపిస్తోంది. వీటితో పాటు నాని `టక్ జగదీష్`- అనుష్క నిశ్శబ్దం- బాలయ్య.. బోయపాటి చిత్రం- నాగచైతన్య సాయిపల్లవి సినిమా.. రానా విరాటపర్వం.. ఇలా చాలా సినిమాలు ఈ ఏడాది క్రేజీ సినిమాలుగా చార్ట్ లో నిలిచాయి.
Please Read Disclaimer