ఇది సముద్రానికి ఎదురీదడమే- సుజీత్

0

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రంలో నటించారు ప్రభాస్. ఆ వెంటనే సుజీత్ లాంటి షార్ట్ ఫిలిం డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. అప్పటికి అతడు వన్ ఫిలిం కిడ్. అలాంటి అనుభవం లేని దర్శకుడికి అవకాశం ఇవ్వడం అంటే అది డార్లింగ్ ప్రభాస్ గట్స్ అనే చెప్పాలి. నువ్వు చేస్తావ్ డార్లింగ్.. చేయగలవ్! అంటూ సుజీత్ ని వెన్ను తట్టి ప్రోత్సహించారు. అంతకుముందు కేవలం సుజీత్ తెరకెక్కించిన లఘు చిత్రం చూసి ఈ ఆఫర్ ఇచ్చారట. అయితే సాహో కంటే ముందే రన్ రాజా రన్ చిత్రంతో సుజీత్ నిరూపించుకున్నారు.

అందుకే నిన్న సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సుజీత్ స్పీచ్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా సాగింది. సుజీత్ మాట్లాడుతూ-“ రాజమౌళి గారితో సినిమా తర్వాత ప్రభాస్ నా సినిమా చేయడమంటే సముద్రానికి ఎదురు ఈదడమే. కానీ నాపై ప్రభాస్ అన్నకు ఎంతో నమ్మకం ఉంది. నువ్వు చేయగలవ్ డార్లింగ్ అంటూ ప్రోత్సహించారు“ అని అన్నారు. ప్రభాస్ జ్ఞాపకశక్తి గురించి సుజీత్ ప్రశంసలు కురిపించారు. “ప్రభాస్ అన్న మైండ్ పెద్ద హార్డ్‌డిస్క్. నాలుగేళ్ల కిందట కూడా చెప్పినవి గుర్తుంటాయి. ట్రైలర్ చివరిలో ప్రభాస్ అన్న తలలో నుంచి రక్తం వస్తూ ఉండే సన్నివేశం ఉంటుంది. అపుడెపుడో కథ చెప్పినప్పుడు ఈ షాట్ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు కూడా ఆయన ఆ షాట్‌ను గుర్తు పెట్టుకున్నారు. అంత జ్ఞాపకశక్తి ఉంటుంది“ అని తెలిపారు.

“మామూలుగా ఫ్యాన్స్ అందరికీ ఉంటారు. కానీ ప్రభాస్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే వారి ఓపికకు నా హ్యాట్సాఫ్. బాహుబలి తర్వాత వెంటనే ప్రభాస్ సినిమా చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడతారు. కానీ మరోసారి రెండేళ్లు ఎదురు చేశారు. మిర్చి టైమ్ లో నేను చేసిన లఘు చిత్రం చూసి ప్రభాస్ పిలిచారు. నేనెక్కడ? ప్రభాస్ గారెక్కడ? అనిపించి నేనే వెళ్లలేదు. తర్వాత వెళ్లి కలిస్తే.. `అదేంటి డార్లింగ్ అప్పుడెప్పుడో పిలిస్తే రాలేదు` అన్నారు. తర్వాత `సాహో` సినిమా కథ ఓకే అయ్యింది. `నువ్వు తీయగలుగుతావ్ డార్లింగ్` అంటూ నాలో కాన్ఫిడెంట్‌ను పెంచారు. ప్రభాస్‌గారికి సినిమా అంటే ప్యాషన్. రాజమౌళిగారితో పనిచేసిన ఆయన నాతో సినిమా చేయడం ఆశ్చర్యం అనిపించింది“ అని అన్నారు. మదిగారు టాప్ టెక్నీషియన్ల సాయంతోనే నేను ఈ ఫీట్ వేయగలిగాను అని వినమ్రతను చాటుకున్నారు సుజీత్.
Please Read Disclaimer