బ్యాడ్ బాయ్స్ ట్రైలర్

0

హాలీవుడ్ యాక్షన్ హీరో విల్‌స్మిత్.. ఆయన కొలీగ్ మార్టిన్ లారెన్స్ కలిసి నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్స్’. 1995లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీకి ది రాక్- అర్మాగెడ్డాన్-పెరల్ హార్బర్ ట్రాన్స్ ఫార్మర్ సిరీస్ చిత్రాల దర్శకుడు మైఖేల్ బే దర్శకత్వం వహించాడు. దీనికి కొనసాగింపుగా వచ్చిన బ్యాడ్‌బాయ్స్-2ని కూడా అతనే తెరకెక్కించాడు. దాదాపు 16 ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఈ చిత్రానికి సీక్వెల్ ని తెరపైకి తీసుకొచ్చారు. విల్‌స్మిత్- మార్టిన్ లారెన్స్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూడవ భాగానికి మాత్రం మైఖేల్ బే కాకుండా ఆదిల్ ఎల్ అరబీ దర్శకత్వం వహించాడు.

రెగ్యులర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. నేటి సాంకేతికతతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్ స్మిత్- మార్టిన్ లారెన్స్ కలిసి ముచ్చటగా మూడవసారి కలిసి నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

ట్రైలర్ లో గత చిత్రాలకు మించి ఫన్.. అండ్ యాక్షన్ రక్తి కట్టిస్తున్నాయి. మరోసారి ఈ ఇద్దరు తమదైన మార్కు హాస్యంతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. కాగా ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది జనవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విల్ స్మిత్ మార్టిన్ డిటెక్టీవ్ లుగా కనిపించబోతున్నారు. వీళ్లద్దరి మధ్య వచ్చే కామెడీ.. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. ఇందులో భారీ ఛేజ్ లో వగైరా కన్నుల పండుగ చేయబోతున్నాయి. హాలీవుడ్ అనువాదాలు తెలుగులో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని అనువదిస్తారా అన్నది చూడాలి.
Please Read Disclaimer