ట్రైలర్ టాక్: అమ్మ జీవిత పయనం గౌతమ్ మార్క్ లో

0

దివంగత ముఖ్యమంత్రి డైనమిక్ లేడీ జయలలిత జీవిత కథ ఆధారంగా రెండు మూడు చిత్రాలు సెట్స్‌పై వున్న విషయం తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ ‘తలైవి’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ పురుచ్చితలైవి జయలలితగా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ని కూడా విడుదల చేశారు. మరో వైపు నిత్యామీనన్ కీలక పాత్రలో `ది ఐరన్ లేడీ` పేరుతో మహిళా దర్శకురాలు ప్రియదర్శి ఓ సినిమా చేస్తోంది. ఈ రెండిటికీ పోటీగా గౌతమ్ మీనన్ క్వీన్ వెబ్ సిరీస్ వేడెక్కిస్తోంది.

వీటికి పోటీగా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్‌మీనన్ జయలలిత జీవిత కథ ఆధారంగా ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. ‘బంగారు కోడిపెట్టి’ నిర్మాత రేష్మ ఘటాల రచనా సహకారంతో గౌతమ్‌మీనన్ – ప్రశాంత్ మురుగేషన్ క్రియేషన్ లో ఈ వెబ్ సిరీస్ మొత్తం 11 ఎపిసోడ్ లుగా రానుంది. ఏస్2 త్రీ- ఫాన్ ఫైట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ మ్యాక్స్ ప్లేయర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. గురువారం దీనికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

జయలలితగా రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. తాజా ట్రైలర్ లో రమ్యకృష్ణ తనదైన మార్క్ ఆహార్యంతో మెరిపించారు. జయలలిత చదువుకునే రోజుల నుంచి రాజకీయ నేతగా ఎదిగిన వరకు ఈ ట్రైలర్ లో చూపించారు. విద్యార్థినిగా మరో యువనటిని.. నటిగా మరో తారను.. చివరికి రాజకీయ నేతగా మారిన జయ పాత్రలో రమ్యకృష్ణను ఇలా వివిధ రూపాల్లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. గౌతమ్ మీనన్ తనదైన శైలిలో క్లాస్సీగా ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారని అర్థమవుతోంది. వివిధ దశలకు వేర్వేరు నటీమణులను తెరపై చూపించి చివరి దశలో మాత్రం అమ్మ పాత్రలో రమ్యకృష్ణను చూపిండం కొంత మైనస్ గా పరిణమిస్తుందా లేక ఆదరణ ఎలా ఉండబోతోంది? అన్నది చూడాలి. ఈ నెల 14 నుంచి ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ మ్యాక్స్ ప్లేయర్ లో ప్లే కానున్నాయి.
Please Read Disclaimer