ట్రైలర్ టాక్: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

0

టాలీవుడ్ లో అడల్ట్ కామెడీ ఇప్పుడు సేలబుల్ పాయింట్ గా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెరపైకి వచ్చిన సినిమాలు చీకటి గదిలో చితక్కొట్టుడు… ఏడు చేపల కథ మేకర్స్ కి లాభాల్ని అందించాయి. చెత్త సినిమాలు తీసినా బూతు కంటెంట్ తో రెచ్చిపోయినా అనుకున్నది సాధించారు. దీంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం టాలీవుడ్ లో మళ్లీ ఊపందుకుంది. మారిన ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా అడల్ట్ కంటెంట్ సినిమాలని అందించాలని యంగ్ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ కోవలో వస్తున్న కొత్త దర్శకుడు బాలు అడుసుమిల్లి నుంచి వస్తున్న చిత్రం `అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి`.

ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నలుగురు అమ్మాయిలు ఒక యువకుడితో కలిసి గోవాలో ఎంజాయ్ చేయడం కొసం వెళతారు. అక్కడ నలుగురు అమ్మాయిలతో కలిసి వెళ్లిన యువకుడు హత్యకు గురవుతాడు. ఆ తరువాత ఏం జరిగింది?. అసలు హత్య చేసింది ఎవరు? అన్నదే ఇందులో మిస్టరీ. ధన్యబాలకృష్ణ- సిద్ధి ఇద్నాని- త్రిధా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. డబుల్ మీనింగ్ డైలాగ్ లు అంతకు అడల్ట్ కామెడీకి మర్డర్ మిస్టరీని జోడించి థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్నితెరపైకి తీసుకొచ్చాడు బాలు అడుసుమిల్లి.

`బావిలో బకెట్ వేసి ఎమ్టీ బకెట్ బయటికి తీయడం చాలా పాపం.. ఈ డైలాగ్ చాలు ఈ సినిమా ఏంటనేది చెప్పడానికి అడల్ట్ కామెడీని నమ్ముకుని కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నమిది. ట్రైలర్ తో అటెన్షన్ క్రియేట్ చేసిన బాలు సినిమాతో ఆకట్టుకుంటాడో లేక అడల్ట్ కంటెంట్.. డైలాగ్ లతో సరిపెడతాడో చూడాలి
Please Read Disclaimer