ట్రైలర్ టాక్: F9

0

ఫాస్ట్ అండ్ ఫ్యారియస్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్ .. అడ్వెంచర్ నేపథ్యంలో ఊపిరి బిగబట్టే స్టంట్స్ తో అసాధారణ బడ్జెట్లతో రూపొందుతున్న సిరీస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూలు చేసే సత్తా ఉన్న ఈ ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా వస్తోంది అంటే యూత్ ఒకటే ఆసక్తిగా ఎదరు చూస్తుంది. ఇప్పటివరకూ ఈ సిరీస్ లో 8 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు `ఎఫ్ 9- ది ఫాస్ట్ సాగా` పేరుతో తొమ్మిదో సినిమా తెరకెక్కుతోంది. ఈ సిరీస్ లో గత రెండు చిత్రాలు మిక్స్ డ్ రివ్యూలతో యావరేజ్ రిజల్ట్ నే అందుకున్నా కలెక్షన్ల పరంగా దుమారం మాత్రం ఆగలేదు.

తాజాగా F9 – ది ఫాస్ట్ సాగా మొదటి ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఛేజ్ లు సాహసాలతో గగుర్పొడిచే విన్యాసాలతో రక్తి కట్టించింది. సూపర్ పాపులర్ రెజ్లింగ్ ఛాంపియన్ జాన్ సెనా… డోమ్ కి సోదరుడిగా నటిస్తున్నాడు. జాన్ సెనా.. డోమ్ కంటే బలవంతుడు తెలివైన వాడిగా కనిపిస్తుంటే సెనా రోల్ కాస్త టోన్ డౌన్ చేసినది గా కనిపిస్తోంది. ఇక ఆరో భాగంలో కనిపించిన హాన్ ఈ తొమ్మిదో భాగంలోనూ కనిపించనున్నాడు. జాసన్ స్టాథమ్ తో హాన్ వైరం ఆసక్తిని కలిగించేదిగా ఉంది. ఫాస్ట్ ఫ్యామిలీ- తేజ్- రోమన్- లెట్టీ- మియా- రామ్సే – హోలీ స్మోక్స్ లాంటి స్టార్లు కనిపించారు.

ఇక ట్రైలర్ లో గాల్లో సుడులు తిరిగే జెట్ విన్యాసాలు.. ఫ్లైవోవర్ తెగి పడుతుంటే దానిపై కార్ రన్ చేయడం ఇవన్నీ చూస్తుంటేనే ఊపిరి తీసుకోనివ్వని సాహస విన్యాసాలకు కొదవేమీ లేదని అర్థమవుతుంది. ఇందులో రాకెట్ ఇంజిన్ అనే కాన్సెప్టు ఎంతో ఇన్నోవేటివ్ గా అనిపిస్తుంది. ఇక క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఎన్నో నమ్మశక్యం కాని విషయాల్ని ఈ సినిమాలో చూపించడం ఆసక్తికరం.
Please Read Disclaimer