అతడే శ్రీమన్నారాయణ ట్రైలర్ టాక్

0

రక్షిత్ శెట్టి.. తెలుగు ప్రేక్షకులకు కనీసం ముఖ పరిచయం అయినా లేని హీరో. అయితే రష్మిక మందన పుణ్యమా అని అతడు ఇప్పుడు తెలుగు యువతకు కూడా సుపరిచితమే. ఫేస్ బుక్.. ట్విట్టర్ డిబేట్ తో టచ్ లో ఉన్నాడు. రక్షిత్ – రష్మిక జంట కన్నడలో కిర్రిక్ పార్టీ అనే చిత్రంలో నటించడం.. అటుపై ప్రేమించుకోవడం.. నిశ్చితార్థం కానిచ్చేయడం.. కాలక్రమంలో ఊహించని మలుపులతో ఆ లవ్ కి బ్రేక్ పడిపోయి పెళ్లి క్యాన్సిల్ అవ్వడం.. వగైరా వగైరా డ్రమటిక్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. కట్ చేస్తే రష్మిక తెలుగు లో పెద్ద స్టార్ హీరోయిన్. రక్షిత్ మాత్రం ఇంకా కన్నడలో సాధా సీదా హీరో.

ఒక సినిమాని తలపించే మెలోడ్రామా ఉంది ఆ ఇద్దరి జీవితంలో. ఇక రియాలిటీలో రక్షిత్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తద్వారా తనకు హ్యాండిచ్చిందని భావిస్తున్న రష్మికకు `అతడే శ్రీమన్నారాయణ` రూపంలో ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ సినిమాని కన్నడ-తెలుగు సహా ఐదు భాషల్లో రిలీజ్ చేయడం ద్వారా తన లెవలేమీ తక్కువ కాదని.. తాను కూడా పాన్ ఇండియా రేంజ్ అని నిరూపించదలిచాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీమన్నారాయణ దారి తప్పిన పోలీస్ కథనా? అన్న సందేహం కలిగించేలా ట్రైలర్ లో చాలా సస్పెన్స్ ని మెయింటెయిన్ చేశారు.

యంగ్ హీరో రక్షిత్ లో ఎనర్జీ మైమరిపించింది. ఒక నిధిని దారి మళ్లించారు. అందుకు కారకుడు శ్రీమన్నారాయణేనా? లేదూ దారి తప్పిన నిధిని వెతుక్కుంటూ వెళ్లిన ఖాకీ శ్రీమన్నారాయణా? అన్నది సస్పెన్స్. పోలీసాఫీసర్ గెటప్ లో రక్షిత్ బావున్నాడు. డార్క్ గ్లాసెస్ పెట్టుకుని ఖాకీ లో క్రౌర్యం ఉన్న కుర్రాడిగా ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అతడి ఆహార్యంలో ఈజ్ బావుంది. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నిధి.. లూటీ అంటూ ట్రైలర్ తో బాగానే వేడెక్కించారు. రెండు తుపాకుల్ని గిరగిరా తిప్పేస్తూ రక్షిత్ స్టైలిష్ గా బాగానే చేశాడు. గెటప్పుల్ని బట్టి ఇది 90ల నాటి కథతోనే తెరకెక్కుతోందని అర్థమవుతోంది. అంతా ఓకే కానీ ప్రచారంలో వెనకబడితేనే తెలుగులో ఆడడం కష్టం. రిలీజ్ సినిమాల్ని మూలమూలలకు తెలిసేలా చేయాలి. ఇందులోనే డబ్బింగ్ నిర్మాతలు ఫెయిలవుతున్నారు. మరి `అతడే శ్రీమన్నారాయణ`కు తెలుగు నిర్మాతలు ఏ రేంజులో ప్రమోషన్ చేస్తారు? అన్నది చూడాలి.
Please Read Disclaimer