ట్రైలర్ టాక్: తిప్పరా మీసం

0

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగుతున్న హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మరోసారి ‘తిప్పరా మీసం’ సినిమాతో నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కృష్ణవిజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. దాదాపు రెండు నిముషాలు ఉన్న ట్రైలర్లో స్టోరీ పెద్దగా రివీల్ చెయ్యలేదు కానీ హీరో పాత్ర ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు.

ట్రైలర్ ఆరంభం లోనే “నా గతాన్ని.. నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం నేను చేసింది తప్పు అని ఓ ముద్ర వేసింది” అంటూ శ్రీవిష్ణు తన పాత్రకు ఇంట్రో ఇచ్చుకుంటాడు. మరో సీన్ లో ఒక క్యారెక్టర్ శ్రీ విష్ణు గురించి చెప్తూ “వాడికున్న కోపమల్లా వాళ్ళమ్మ మీదే” అంటారు. దీన్ని బట్టి ఏదో ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని హింట్ ఇచ్చినట్టే. శ్రీవిష్ణు పాత్ర నెగెటివ్ టచ్ తో ఉంది. అమ్మకు ఇల్లు లేకుండా చేయడంతో పాటుగా డ్రగ్స్.. మందు.. అమ్మాయిలు ఇలా అన్నీ అవలక్షణాలు ఉన్నాయని అన్నీ చూపించారు. ఎవరు ఎలా అనుకున్నా శ్రీవిష్ణు అవేవీ పట్టించుకోడు. “ఎవరేమనుకున్నా నేను అనుకునేదే చేస్తా” అంటూ శ్రీవిష్ణు స్వయంగా ఆ విషయం చెప్తాడు. ఫుల్ గా గడ్డం పెంచి ఇంటెన్స్ లుక్ లో వయొలెంట్ పనులు చేస్తూ ఉన్నాడు.

ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా.. ఇంట్రెస్టింగ్ గా ఉంది. శ్రీవిష్ణు ఎందుకు అలా మారాడు.. దాని వెనకున్న కారణం ఏంటి అనేది సస్పెన్స్. డైలాగ్స్.. విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్న వారికి ‘అర్జున్ రెడ్డి’ పాత్ర గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు.. చూసేయండి.. శ్రీవిష్ణు ఇంటెన్స్ అవతారం.
Please Read Disclaimer