ట్రైలర్ టాక్: యాక్షన్

0

తీవ్రవాదం అనేది పెనుసమస్య. ప్రపంచ దేశాల్ని అల్లకల్లోలం చేస్తున్న సీరియస్ ప్రాబ్లెమ్ ఇది. గత కొన్నేళ్లుగా ఐసిస్ ఉగ్రవాదం పెను విధ్వంశాలపైనా ప్రపంచ దేశాల్లో సీరియస్ గా చర్చ సాగుతోంది. అందుకే అమెరికా-భారత్ సహా ఎన్నో దేశాలు ఈ ప్రమాదంపై నిరంతరయుద్ధం చేస్తున్నాయి. తీవ్రవాదానికి మూలాలు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని దానిని అంతం చేయడమే అమెరికా సహా భారత ప్రభుత్వ ఎజెండా. అమెరికాలో సీఐఏ గ్లోబల్ ఏజెన్సీ.. ఇండియాలో రా ఏజెన్సీ నిరంతరం తీవ్రవాదం మూలాల్ని కనుగొనేందుకు సీరియస్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. దొరికినవాళ్లను దొరికినట్టే తుదముట్టించడం అజెండాగా కొన్ని టీమ్ లు పని చేస్తుంటాయి.

తాజాగా విశాల్ నటించిన `యాక్షన్` తెలుగు ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఇండియా నుంచి అమెరికా- టర్కీ సహా విదేశాల్లో ఆపరేషన్ నిర్వహించే ఓ రా ఏజెంట్ కథాంశం ఇదని అర్థమవుతోంది. రెండు దేశాల మధ్య ఇంటర్నేషనల్ సమస్య ఇదీ.. అంటూ విదేశాలతోనూ కథను ముడిపెట్టేయడం చూస్తుంటే ఈ కథలో స్పాన్ చాలా ఎక్కువ అని అర్థమవుతోంది. విశాల్ ఈ చిత్రంలో కల్నల్ సుభాష్ పాత్రలో నటిస్తున్నారు. అతడితో పాటు తమన్నా భారీ యాక్షన్ తో అదరగొడుతోంది. భారీ భవంతులపై నుంచి జంప్ లు.. బైక్ ఛేజ్ లు.. కార్ ఛేజ్ లు వగైరా జేమ్స్ బాండ్ తరహా ఫీట్స్ తో అదరగొట్టేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.

విశాల్ బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సూటైన యాక్షన్ కథాంశాన్ని యూనివర్శల్ అప్పీల్ తో చూపిస్తున్నారా? అన్నంత గ్రిప్పింగ్ గా ఉందీ ట్రైలర్. ఈ ట్రైలర్ చూశాక.. పాన్ ఇండియా అప్పీల్ కనిపిస్తోంది. హిప్ హాప్ థమీజా మరోసారి మాస్టర్ క్లాస్ రీరికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు. సుందర్.సికి ఈసారైనా పాన్ ఇండియా కల నెరవేరుతుందా? అన్నది చూడాలి. యాక్షన్ చిత్రాన్ని వరంగల్ శ్రీను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer