బిగ్ బాస్ ట్రైన్ టాస్క్: క్యారెక్టర్లలో జీవించేసిన హౌస్ మేట్స్…

0

బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో నవరసాలని వెలికే తీసి పనిలో ఉన్నట్లున్నారు. మంగళవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జోన్ లో ఉన్నవారికి సీక్రెట్ టాస్క్ లు ఇచ్చి హౌస్ లో పెద్ద రచ్చ జరిగేలా చేసిన బిగ్ బాస్ బుధవారం ఇంటి సభ్యులకు సరదా టూర్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు’ ‘ఛలో ఇండియా’. ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు వివిధ క్యారెక్టర్లల్లో బిగ్ బాస్ హౌస్ లో ఉంచిన బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ లో ఇండియాలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ట్రైన్ టూర్ మేనేజర్ గా అలీ ఉండగా.. హనీమూన్ కపుల్ గా రవి – పునర్నవిలు ఉండాలి.

ఇక తల్లీకూతుళ్లుగా శివజ్యోతి-వితిక – అందమైన అమ్మాయిగా శ్రీముఖి.. ఆమె టూర్ మేనేజర్ అలీకి సైట్ కొడుతోంది. అలాగే అమాయకుడైన భర్తగా మహేష్ – గడుసరి భార్యగా హిమజ.. ట్రైన్ డ్రైవర్స్ గా వరుణ్ – రాహుల్ లు ఉంటారు. ఇక చివరికి ట్రైన్లో టీ – స్నాక్స్ – ఆహారం అందించే బాధ్యతల్ని బాబా భాస్కర్ కి అప్పగించారు. క్యారెక్టర్లు ఇవ్వడం అయిన వెంటనే ఎవరికి వారు రెడీ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ బజర్ మ్రోగగానే అందరూ యాక్షన్ లో దిగేశారు. ఎవరి క్యారెక్టర్ లో వారు జీవించేశారు.

శ్రీముఖి అందమైన అమ్మాయిగా పొట్టి నిక్కర్ వేసుకుని రెచ్చిపోయి….అలీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అలీ కూడా నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా శ్రీముఖితో రొమాన్స్ చేసేందుకు సై అన్నాడు. అటు కొత్తగా పెళ్లై హనీమూన్ కి వచ్చిన జంటగా రవి – పునర్నవిలు జీవించేశారు. నిజంగానే వీరికి కొత్తగా పెళ్లై హనీమూన్ కు వెళుతున్నారన్నట్లుగా పెర్ఫార్మన్స్ చేశారు. ఒకర్నొకరు చుట్టేసుకుని కౌగిలింతలతో రచ్చ చేసేశారు. అలాగే ట్రైన్ లో ఉన్న మరో జంట మహేశ్ అమాయకుడైన భర్తగా – హిమజ నోరు పారేసుకునే భార్యగా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక రాహుల్-వరుణ్ లు ట్రైన్ నడుపుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక బాబా భాస్కర్ టీ – స్నాక్స్ అమ్ముతూ ట్రైన్ లో కామెడీ చేశారు. తనకు ముగ్గురు భార్యలు ఉన్నారని… తాను ట్రైన్లలో టీ – స్నాక్స్ అమ్ముకుని జీవిస్తుంటానని చెప్పడం అందరిని నవ్వించింది. ట్రైన్ వివిధ ప్రదేశాలు వచ్చినప్పుడు బిగ్ బాస్ ఆసక్తికరమైన టాస్క్ లు ఇస్తూ ఇంకా ట్రైన్ జర్నీని రక్తికట్టించారు. అయితే ఈ ట్రైన్ జర్నీ గురువారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home