ట్రెండీ స్టోరి: హాటీ నాటీ ఫిట్నెస్ ఫ్రీక్స్

0

ఫిట్నెస్ ఫ్రీక్ అన్న పదానికి పర్యాయపదం వెతకాల్సిన పనేలేదు. ఇదిగో ఈ భామల పేర్లు చెబితే చాలు… ఫిట్నెస్ అన్న పదానికే మీనింగ్ తెలుస్తుంది. బాలీవుడ్ లో పెర్ఫెక్ట్ జిమ్ ఫిగర్స్ జాబితా తిరగేస్తే అందులో టాప్ 3లో ఉంటారు ఆ ముగ్గురూ. ఈ భామలు జిమ్ కి వెళితే చాలు పొగలు వచ్చేయాల్సిందే. స్టీమ్ ఇంజిన్ లో స్టీమ్ ఉక్కిరిబిక్కిరి చేసినట్టే.

శ్రమ కొద్దీ రూపం అన్న స్పోర్టివ్ స్పిరిట్ ని పాటిస్తున్న అందగత్తెలుగా వీళ్లకు ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. ఒక పూట తిండి అయినా మానేస్తారేమ కానీ జిమ్ కి వెళ్లకుండా వీళ్లను ఊహించుకోలేం. అంతగా అడిక్ట్ అయ్యి నిరంతరం జిమ్మాయనమహః అంటూ వేడెక్కించేస్తుంటారు. అంతేనా.. ఫిట్ నెస్ జోన్ లోకి వెళితే అందుకు తగ్గ డ్రెస్ కోడ్ ని మెయింటెయిన్ చేయడంలోనూ ఈ భామామణుల తర్వాతనే. రోమ్ వెళ్లినా.. జిమ్ కి వెళ్లినా ఎక్కడా తగ్గరు. ఆకర్షణీయంగా ఉండాలన్న కనీస ధర్మాన్ని పాటించడంలో ఈ భామామణుల తర్వాతనే. వీళ్లను చూడగానే మనం కూడా అలా చేయాలి! అన్న ఫీల్ కలుగుతుంది.

కరీనాకపూర్ జిమ్ కి వెళ్లే ముందు ప్రోటోకాల్ అభిమానులకు తెలిసిందే. జిమ్ డ్రెస్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. లెగ్గింగ్ .. స్పోర్ట్స్ బ్రా ఊహించనంత రిచ్ లుక్ తో ఉండాల్సిందే. ఇక టైట్ డ్రెస్ పై డార్క్ థిక్ కలర్ జాకెట్ ని ధరిస్తుంటుంది. దానివల్ల ట్రెండీ లుక్ లో కనిపిస్తుంది ఈ మమ్మీ గారు.

కపూర్ వంశపు చలాకీ గాళ్ జాన్వీ సంగతి చూస్తే.. ఇప్పుడున్న ఫిట్టెస్ట్ యంగ్ స్టార్లలో జాన్వీ ఒకరు. తన హార్డ్ వర్క్ గురించి చెప్పాలంటే జస్ట్ ఆ యాబ్స్ చూస్తే చాలు. ఆరు పలకలతో ఎంతో స్లిమ్ లుక్ తో కనిపిస్తుంది. కపూర్ గాళ్ స్ఫూర్తి ఎవరు? అన్నది అటుంచితే తనే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. టోన్డ్ బాడీకి తగ్గట్టుగానే స్పోర్ట్స్ బ్రా.. మల్టీ స్ట్రాప్డ్ లుక్ ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఖరీదైన డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ ని తన వెంటే తీసుకెళ్లడం జాన్వీకే చెల్లింది.

46వయసులోనూ మలైకా అరోరాఖాన్ హొయలు గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరం జిమ్ముల్లో కుస్తీలు పట్టే నాయికగా యోగా గాడెస్ గా తను పాపులర్. తాను జిమ్ కి వెళ్లినా.. యోగా చేసినా డిఫరెంట్ ఔట్ ఫిట్స్ ని చూపించేందుకు ఆసక్తిగా ఉంటుంది. యానిమల్ ప్రింటెడ్ .. ఫ్లోరిష్ లుక్.. బమ్ షాట్స్ డిజైన్స్ ని అమితంగా ఇష్టపడుతుంది మలైకా. దేహశిరుల్ని కమ్మేసే డిజైనర్ స్పోర్ట్స్ డ్రెస్సుల్లో కొత్తందాల్ని ఎలివేట్ చేస్తుంది.

సీకే బ్యూటీ దిశాపటానీ ఎవ్వర్ లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో చేయాలంటే తన తర్వాతనే. పబ్లిక్ లోకి వెళ్లినా జిమ్ నుంచి వచ్చినా ఈ అమ్మడి నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టమే. టైట్ స్పోర్ట్స్ డిజైనర్ డ్రెస్సులకు బ్రాండ్ అంబాసిడర్. ముఖ్యంగా సీకే బ్రాండ్ తో జిమ్ముల్లో సింపేస్తుంది. సారా అలీఖాన్.. పాండే గాళ్.. శ్రద్ధా కపూర్ వీళ్లందరిదీ అదే కేటగిరీ. వీళ్ల స్ఫూర్తితో జిమ్ముల్లో యోగా సెంటర్లలో నవతరం ఇదే లుక్ లో కనిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Please Read Disclaimer