త్రిష – సమంత.. ఎవరిది పైచేయి?

0

త్రిష గొప్పా.. సమంత గొప్పా.. అర్జెంటుగా ఇప్పుడు ఈ లెక్క తేల్చే పనిలో పడింది సోషల్ మీడియా. త్రిష కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన 96 సినిమా రీమేక్లో సమంత ఆమె పాత్రలో నటించడమే ఇందుక్కారణం. ఒకప్పుడు దక్షిణాదిన నంబర్ వన్ హీరోయిణ్గా ఒక వెలుగు వెలిగింది త్రిష. ఐతే చాలా ఏళ్ల కిందటే ఆమె జోరు తగ్గిపోయింది. ఇక ఆమె పనైపోయిందనుకున్న తరుణంలో 96 మూవీ ఆమె పేరు మళ్లీ మార్మోగేలా చేసింది. ఈ సినిమాలో జాను పాత్రలో అద్భుతంగా నటించి తమిళ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిందామె. త్రిష కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫామెన్స్గా నిలిచింది. ఆమెకు జోడీగా నటించిన విజయ్ సేతుపతి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి కల్ట్ మూవీ రీమేక్ అంటే.. తెలుగు లీడ్ పెయిర్ ఎలా చేస్తారా అన్నది ఆసక్తి అందరిలోనూ నెలకొంది.’

ఐతే 96 రీమేక్ జాను టీజర్ చూశాక శర్వానంద్ సంగతి వదిలేసి.. అందరూ సమంత మీదే ఫోకస్ పెట్టారు. త్రిషతో పోలిస్తే ఆమె ఎలా చేసిందా అని చూశారు. మామూలుగా సమంత మంచి నటే కానీ.. జానులో మాత్రం సమంత సాధారణంగానే కనిపించింది. త్రిషతో పోలిస్తే ఆమె హావభావాలు అంత గొప్పగా లేవు. మామూలుగా చూస్తే ఏమో కానీ.. త్రిష ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ తో పోలిస్తే మాత్రం సమంత నిలవలేకపోయింది. లుక్స్ పరంగా కూడా త్రిషనే మెరుగ్గా కనిపిస్తోంది. సోషల్ మీడియా జనాలు సినిమాలో వివిధ సన్నివేశాల్లో త్రిష సమంతల హావభావాలు పోల్చి చూపిస్తూ త్రిషను పొగిడేసి సమంతను ట్రోల్ చేస్తుండటం గమనార్హం. మరి సినిమా చూశాక జనాల స్పందనెలా ఉంటుందో చూడాలి.
Please Read Disclaimer