ఆచార్య నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించిన త్రిష

0

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో నటించబోతున్న హీరోయిన్ ఎవరు అంటే చాలా కాలం ప్రచారం జరిగింది. చాలా పేర్లు ప్రచారం జరిగాయి. చివరకు త్రిష అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు త్రిషను అధికారికంగా హీరోయిన్ గా ప్రకటించలేదు. ఇటీవలే త్రిష ఆచార్య చిత్రం షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా తెలిసింది. షూటింగ్ లో రెండు మూడు రోజులు పాల్గొందో లేదో అప్పుడే తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది.

ట్విట్టర్ ద్వారా కొద్ది సమయం క్రితం ఈ విషయాన్ని త్రిష చెప్పుకొచ్చింది. కొన్ని సార్లు మనకు చెప్పింది ఒకటి ఉంటుంది.. అక్కడ ఉండేది మరోటి ఉంటుంది. చర్చింది ఒకలా అక్కడ ఉండేది మరోలా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. క్రియేటివ్ విభేదాల కారణంగా నేను చిరంజీవి సర్ సినిమాలో పార్ట్ అవ్వొద్దని నిర్ణయించుకున్నాను. చిత్ర యూనిట్ సభ్యులకు నా శుభాకాంక్షలు. వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంది. ఇక తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలోనే మరో మంచి ప్రాజెక్ట్ తో వస్తానంటూ ట్వీట్ చేసింది.

కొరటాల శివ కథ చెప్పిన సమయంలో ఒకలా చెప్పి తీసే సమయంలో మరోలా తీయడం వల్ల త్రిష తప్పుకున్నట్లుగా ఆమె ట్వీట్ ను బట్టి అర్థం అవుతుంది. కొరటాల శివ సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉండదు. అందుకే త్రిషకు నచ్చక పోవడం వల్ల సినిమా నుండి తప్పుకుని ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి త్రిష తప్పుకోవడంతో ఆచార్య కోసం మరో హీరోయిన్ ను వెదకాల్సిన పరిస్థితి వచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-