జయలలిత శిష్యురాలా మజాకానా?

0

అమ్మ జయలలిత బతికి ఉంటే ఈపాటికి త్రిష రాజకీయాల్లోకి వచ్చేదే! అంతటి సాన్నిహిత్యం ఆ ఇద్దరిదీ. కానీ అనూహ్యంగా అమ్మ వెళ్లిపోయింది. తన బిడ్డ త్రిషమ్మ ఏకాకి అయిపోయింది. తన రాజకీయారంగేట్రానికి ముందే ఇలా జరుగుతుందని ఊహించలేదు. అవునా.. ఇది నిజమా? అన్న సందేహం అవసరం లేదు. తమిళ తంబీల్లో నిరంతరం సాగే ఆసక్తికర చర్చ ఇది. కెరీర్ మసకబారుతున్న క్రమంలో తనకు ఎంతో ఆప్తురాలైన జయలలిత వారసత్వాన్ని అంది పుచ్చుకుని రాజకీయాల్లో రాణించాలని త్రిష పెద్ద స్కెచ్ వేసిందని తమిళ మీడియాలో ప్రచారమైంది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది.

అయితే తానొకటి తలిస్తే అన్న చందంగా త్రిష అనుకున్నది జరగలేదు. ఆ క్రమంలోనే కథానాయికగా బ్రేక్ రావడం.. ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడం తో కెరీర్ పరంగా యూటర్న్ తీసుకుంది. గత ఏడాది రిలీజైన 96 మూవీ గ్రాండ్ సక్సెస్ త్రిష పేరు మార్మోగిపోయేలా చేసింది. మరోసారి త్రిష హవా ఐదేళ్ల పాటు సాగేంత బిగ్ హిట్ సాధించింది ఈ చిత్రం. ఒకవేళ త్రిష కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోతే సన్నివేశం వేరేగా ఉండేదే. ఓవైపు పెటా సభ్యురాలిగా త్రిష లోని సెన్సిబిలిటీస్ కి వీరాభిమానులు ఉన్నారు.

96 సినిమా కమర్షియల్ సక్సెస్ తో పాటు వరుసగా అవార్డులు రివార్డులు అందిస్తోంది. అప్పటికే అరడజను పైగా ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో 96 పేరు మార్మోగిపోయింది. తాజాగా ఏషియానెట్ ఫిలిం అవార్డ్స్ 2019 విజేతగా నిలిచింది. ఈ అవార్డుల వేడుకకే త్రిష డిజైనర్ లుక్ వన్నె తెచ్చింది. ప్రఖ్యాత సవ్యసాచి అపూరూపమైన డిజైన్ లో తళతళా మెరిసిపోయింది. స్లీవ్ లెస్ లో యువతరం మతి చెడగొట్టిందంతే.
Please Read Disclaimer