చరణ్ ఎంట్రీతో త్రిష ఎగ్జిట్ అయ్యిందా?

0

ఆచార్య చిత్రం నుండి త్రిష తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆమె నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రాకుండానే ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొని వెంటనే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందంటూ తప్పుకుంది. మొదట చెప్పిన విధంగా తీయడం లేదంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆచార్యలో ఏం జరుగుతుంది అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో సినీ వర్గాల్లో ఒక పుకారు తెగ షికారు చేస్తోంది. రామ్ చరణ్ పాత్ర వల్లే త్రిష తప్పుకుంది అంటున్నారు.

మొదట ఆచార్య కథను త్రిషకు చెప్పిన సమయంలో చరణ్ పాత్ర పెద్దగా లేదట. గెస్ట్ పాత్రగానే ఆ పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్పాడట. కాని ఇప్పుడు చిరంజీవి సూచన మేరకు ఆ పాత్రను కాస్త ఎక్కువగా పెంచారట. చరణ్ పాత్రను పెంచడంతో ఆయనకు ఒక హీరోయిన్ రెండు పాటలు.. యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని టాకీ సీన్స్ కూడా పెంచారట. ఈ సమయంలో త్రిషకు సంబంధించిన పాత్ర మొత్తం మారినట్లయ్యిందట. దాంతో పాటు ఆమె స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా తగ్గిందట.

చరణ్ కు ఆచార్యలో ఎక్కువ ప్రాముఖ్యత ఉండటంతో త్రిష ప్రాముఖ్యత తగ్గిందనే కారణంగా ఆమె తప్పుకుందని ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. చరణ్ కాకుండా మరో హీరోను ఆ పాత్రకు చేయిస్తే గెస్ట్ గానే చూపించాలనుకున్నారట. కాని చరణ్ కాబట్టి బడ్జెట్ విషయంలో పెద్దగా సమస్య లేదు. నిర్మాత కూడా ఆయనే అవ్వడం వల్ల పాత్ర ఎక్కువగా ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయానికి చిరంజీవి వచ్చాడట. ఆ కారణంగానే చరణ్ పాత్రను పెంచడం తో త్రిష ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-