ఆ విషయంలో కుటుంబ సభ్యుల మాట అస్సలు వినను : త్రిష

0

మరో రెండు సంవత్సరాలు అయితే త్రిష ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు కూడా పూర్తి అవ్వబోతుంది. మరికొంత కాలం అయితే ఆమె వయసు నాలుగు పదులు కూడా దాటబోతుంది. అయినా ఇప్పటి వరకు హీరోయిన్ గా వరుసగా చిత్రాలు చేస్తుంది. ఇక పెళ్లి మాట ఎత్తితే ఇప్పుడేనా అన్నట్లుగా సమాధానం ఇస్తుంది. నాలుగు అయిదు సంవత్సరాల క్రితమే ఈమె పెళ్లికి రెడీ అయ్యింది. వరుణ్ అనే నిర్మాత కమ్ వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం కూడా చేసుకుంది.

తాజాగా త్రిష పెళ్లికి సంబంధించి మరోసారి మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. ఈమె తాజా లేడీ ఓరియంటెడ్ చిత్రం పరమపదం విళైయాట్టు చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాను కాని ఎప్పుడు చేసుకుంటాను అనే విషయాన్ని మాత్రం చెప్పలేను. నాకు నచ్చిన వ్యక్తి తారస పడ్డప్పుడు తప్పకుండా పెళ్లికి సిద్దం అంటూ ప్రకటించింది.

పెళ్లి విషయంలో నా కుటుంబ సభ్యుల మాటను నేను వినాలని అనుకోవడం లేదు. వారు అబ్బాయిని చూపిస్తే తల వంచుకుని తాళి కట్టించుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పటికైనా ప్రేమ వివాహంను చేసుకుంటాను అంటూ త్రిష క్లారిటీ ఇచ్చింది. నేను చేసుకోబోతున్న వ్యక్తి హీరో అయ్యి ఉండక్కర్లేదు.. కలర్ తో అవసరం లేదు. మంచి మనసు ఉండి నా ఫీలింగ్స్ కు గౌరవం ఇచ్చే వాడు అయ్యి ఉండాలని త్రిష చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-