17 ఏళ్ల కెరీర్ లో ఆ రెండు పాత్రలే మ్యాజిక్

0

హీరోయిన్ లైఫ్ స్పామ్ తక్కువగా ఉంటుందనే వాదనను కొట్టి పారేస్తూ అందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నిలిచిన ముద్దుగుమ్మ త్రిష. గత 17 సంవత్సరాలుగా హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న ఈ అమ్మడు అప్ అండ్ డౌన్ అంటూ కిందకు మీదకు కెరీర్ ఊగిసలాడుతూ వస్తోంది. త్రిష పనైపోయింది.. ఇక ఆమె ఆంటీ పాత్రలు చేసుకోవాల్సిందే అంటూ జనాలు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా 96 చిత్రంతో మళ్లీ పూర్వ వైభవంను దక్కించుకుంది.

ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు చాలా బిజీగా సినిమాలు చేస్తూ వస్తోంది. వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో మరో రెండు మూడు సంవత్సరాల వరకు ప్రేక్షకుల ముందే ఉండబోతుంది. ఇటీవల 96 చిత్రంకు అవార్డు అందుకున్న సందర్బంగా త్రిష ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆ సినిమాకు తాలూకు జ్ఞాపకాలను నెమరవేసుకుంది. సినిమాపై ఎక్కువ నమ్మకం లేకుండానే చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

సినిమాలోని పాత్రలు చాలా బాగున్నాయి.. తన పాత్ర విభిన్నంగా ఉంది. తప్పకుండా ఆకట్టుకుంటుందనుకున్నాను. కాని సినిమా ఇంత సక్సెస్ అవుతుందనుకోలేదు. జాను పాత్ర చాలా సింపుల్ గా ఒకే కాస్ట్యూమ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆధరించారు. గతంలో విన్నైతాండి వరువాయా చిత్రంలోని జెస్సీ పాత్ర మరియు 96 చిత్రంలోని జాను పాత్రలు మాత్రమే ఒకరకమైన మ్యాజిక్ ను క్రియేట్ చేసి సింపుల్ గా ఉన్నా కూడా ఆకట్టుకున్నాయంది. 96 చిత్రం తర్వాత త్రిష వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో చిరంజీవి 152 చిత్రంలో కూడా త్రిష ఒక హీరోయిన్ గా ఎంపిక అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
Please Read Disclaimer