పెళ్లి ఎప్పుడంటే త్రిష షాకింగ్ సమాధానం

0

హీరోయిన్ త్రిష.. అప్పుడు ఎప్పుడో ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ తో ఆడిపాడి పాపులర్ అయిన ఈ మగువ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అఫ్ కోర్స్ ప్రభాస్ కు కూడా పెళ్లి అవ్వలేదనుకోండి. ప్రభాస్ మగాడు కాబట్టి లేట్ అయినా పర్లేదు. కానీ త్రిష పెళ్లి మాత్రం ఇప్పటికీ జరగలేదు.

అప్పట్లో హీరో శింబుతో త్రిష ప్రేమ.. పెళ్లిపై పుకార్లు వచ్చాయి.. వెటరన్ బ్యూటీకి కిందటేడాది ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లిపీఠలెక్కక ముందే వారిద్దరు పెళ్లిని రద్దును చేసుకున్నారు.

ఆ తర్వాత నుంచి త్రిష వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ బీజీగా మారింది. తాజాగా మరోసారి త్రిష పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే నీ పెళ్లి ఎప్పుడు అన్న వార్తలపై త్రిష స్పందించింది. ‘తాను పెళ్లి చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదని.. తప్పకుండా చేసుకుంటాను’ అని త్రిష స్పష్టం చేసింది. అయితే నా వృత్తిని గౌరవించేవాడిని పెళ్లి చేసుకుంటా.. నా ఇష్టాలను నా అభిరుచులను గౌరవించాలి. ఒకవేళ అలాంటి వాడు దొరకకపోతే ఒంటరిగానే బతుకీడుస్తా.. పెళ్లి చేసుకోకుండా బతికే ధైర్యం తెగువ తనకు ఉన్నాయని.. ఆడవాళ్లు ఎవరి తోడూ లేకుండా మనుగడ సాధించగలరని త్రిష చెబుతోంది. త్రిష తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఆమె ‘బ్రహ్మాచారిణిగా’ ఫిక్స్ అయ్యిందని అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.