అల వైకుంఠపురంలో గురూజీ బర్త్ డే వేడుకలు

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు నేడు. ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ఆయన ఫ్యాన్స్ వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇక ఏ దర్శకుడి పుట్టిన రోజై నా కూడా ఆయన చేస్తున్న సినిమా యూనిట్ సభ్యులు కేక్ కట్ చేయించడం.. వేడుక జరుపడం కామన్ గా చూస్తూనే ఉంటాం. అలాగే త్రివిక్రమ్ ప్రస్తుతం అల వైకుంఠపురంలో చిత్రంను చేస్తున్నారు. ఆ చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా నిన్న అర్థ రాత్రి సమయంలో త్రివిక్రమ్ తో కేక్ కట్ చేయించారు.

అల్లు అర్జున్.. పూజా హెగ్డే.. థమన్ ఇతర నటీనటులు టెక్నీషియన్స్ ప్రొడక్షన్ టీం అంతా కలిసి రాత్రి త్రివిక్రమ్ బర్త్ డే వేడుక నిర్వహించారు. త్రివిక్రమ్ బర్త్ డే కార్యక్రమంలో ఆయన భార్య కూడా పాల్గొంది. అల్లు అర్జున్ ప్రత్యేకంగా త్రివిక్రమ్ బర్త్ డే ను జరిపించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. రాత్రి లేట్ నైట్ పార్టీని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఎంజాయ్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న అల వైకుంఠపురంలో చిత్రంకు యమ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలతో పాటు బన్నీ లుక్ మరియు సినిమాలో టబు ఉండటం వంటి విషయాల కారణంగా సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బన్నీ మరియు త్రివిక్రమ్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అవ్వడంతో పాటు ఆ కాంబోకు హ్యాట్రిక్ ను అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.
Please Read Disclaimer