దర్శకుడికి కటౌట్.. హీరో ఫ్యాన్స్ కుళ్లుకోరా?

0

దర్శకుడి ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కాని సినిమా సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా హీరోలకు వెళ్తుంది అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ్యత మాత్రం దర్శకులు మోయాల్సి వస్తుంది. సినిమా విడుదల సమయంలో హీరోలకు కటౌట్స్ మరియు ప్లెక్సీలు పెడతారు. కాని దర్శకులను మాత్రం పట్టించుకునే వారు చాలా తక్కువ. దర్శకులను అభిమానిస్తారు కాని కటౌట్స్ పెట్టేది మాత్రం హీరోలకే. కాని మొదటి సారి దర్శకుడు త్రివిక్రమ్ కు కటౌట్ పెట్టారు.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందిన అల వైకుంఠ పురంలో సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం విడుదలకు రెండు వారాలు ఉండగానే ప్రమోషన్స్ మొదలు అయ్యాయి. అల్లు అర్జున్ కటౌట్లు అప్పుడే పెట్టేస్తున్నారు. ఒక థియేటర్ వద్ద అల్లు అర్జున్ కటౌట్ తో పాటు త్రివిక్రమ్ కటౌట్ ను కూడా పెట్టారు. అల్లు అర్జున్ కు సమానమైన కటౌట్ త్రివిక్రమ్ కు పెట్టి అక్కడ అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు.

దర్శకులకు కటౌట్లు చాలా తక్కువ గా మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ కు దక్కని అరుదైన గౌరవం గురూజీ త్రివిక్రమ్ కు దక్కిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం కుళ్లుకుంటూ ఉంటారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోలతో పాటు వారి సినిమాల దర్శకుల కటౌట్స్ పెట్టలేదు కాని ఇప్పుడు మా హీరో కటౌట్ తో త్రివిక్రమ్ ది పెట్టాల్సిన అవసరం ఏంటంటూ మౌనంగా అల్లు ఫ్యాన్స్ బాధపడుతూ ఉంటారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer