‘ఇండస్ట్రీ హిట్టు’ పై బన్ని రియాక్షన్ ఇదే

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబో మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కాంపిటీషన్ లో బన్ని హవా సాగింది. ఏపీ-తెలంగాణలో చాలా ఏరియాల్లో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను సైతం తిరగరాసిందని ఫీడ్ బ్యాక్ వస్తోంది. అమెరికాలోనూ రంగస్థలం రికార్డును బ్రేక్ చేసింది. అంతకు ముందే 200 కోట్ల వసూళ్లు అంటూ పోస్టర్ వేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అల యూనిట్ ధీమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అంటూ ఓ పోస్టర్ ని ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

మరో 24 గంటలైనా గడవక ముందే కాంపిటీటర్ అయిన `సరిలేరు నీకెవ్వరు` టీమ్ నుంచి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటూ కొత్త పోస్టర్ రిలీజైంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వార్ పై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెడెక్కిస్తున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో టీమ్ మీడియాతో ఇంటరాక్ట్ అయింది. ఈ సమావేశం లో అల టీమ్ తరపున బన్ని వకాల్తా పుచ్చుకున్నారు. పోస్టర్ వార్ పైనా.. తమ వసూళ్ల పైనా తెలివి గా మాట్లాడారు. ఒక రకంగా అల టీమ్ ని డిపెండ్ చేసే ప్రయత్నం చేసాడు.

సక్సెస్ వేదికపై బన్ని మాట్లాడుతూ-“గీతా ఆర్స్ట్ లో ఆల్ టైమ్స్ హిట్స్ 15 వరకూ ఉంటాయి. అందులో నా సినిమా ఎప్పుడు చేరుతుందా? అని అనుకునేవాడిని. ఆ డ్రీమ్ అల వైకుంఠపురములో తో తీరింది. మేం మా పని మాత్రమే చేసాం. ప్రేక్షకులు దాన్ని మ్యాజిక్ చేసారు“ అంటూ చెప్పుకొచ్చాడు. ఓ సినిమా చేసేటప్పుడు ఓ అంచనా ఉంటుంది. కానీ ఆ అంచనాలను మించి అల.. చిత్రం వసూళ్లు సాధించింది. అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఒకే తరహా రెస్పాన్స్. రికార్డులనేవి సైక్లిక్ ప్రాసెస్. ఒకరిది నిన్న అయితే మరొకరది నేడు. అటుపై ఇంకో హీరో కొడతారు…. అంటూ బన్ని తనదైన ఫిలాసఫీని చెప్పారు.

“ప్రేక్షకులు సినిమాలను మాత్రమే ఇష్ట పడతారు. హీరోల ర్యాంక్ లు కాదు. పోస్టర్లపై నంబర్లు అనేవి ప్రపంచానికి సక్సెస్ గురించి తెలియజేసేవి మాత్రమే. ప్రేక్షకులు డబ్బు మాత్రమే ఖర్చు పెట్టి థియేటర్ కు రావడంలేదు. వాళ్ల విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. వాళ్ల ప్రేమకు గుర్తు గా ఈ పోస్టర్లు..నెంబర్లు వేస్తుంటారు“ అంటూ తెలివిగా కవరింగ్ చేశాడు.
Please Read Disclaimer