ఈసారైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొడతాడా?

0

అవును మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సారి ఓ టార్గెట్ పెట్టుకొని ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఓ అదిరిపోయే హిట్ కొట్టి ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకోవాలనేది ఆ టార్గెట్. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. గతేడాది పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాత వాసి’ అనే సినిమా తీసి సంక్రాంతి బరిలో దిగాడు త్రివిక్రమ్. అయితే భారీ హైప్ తో వచ్చిన ఆ సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది.

అందుకే ఈ సారి ఎలాగైనా తను మిస్ అయినా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ను అందుకోవాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఇప్పటికే తమన్ నుండి అదిరిపోయే సాంగ్స్ తీసుకున్న త్రివిక్రమ్ దగ్గరుండి మరీ బి.జి.ఏం అందుకుంటున్నాడట. ఈసారి కంటెంట్ కూడా బాగుండేలా జాగ్రత్త వహించి పోస్ట్ ప్రొడక్షన్ లో దాన్ని ఇంకా హైలైట్ చేసేలా శ్రద్ధ పెడుతున్నాడట.

నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్న అనిల్ రావిపూడి – అలాగే సతీష్ వేగేశ్న ఇద్దరూ సంక్రాంతి విన్నర్స్ గా రుజువు చేసేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ టైం అందుకే ఈసారి సంక్రాంతి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కీరిటంపై కన్నేసాడు. మరి ఈ సారైనా త్రివిక్రమ్ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడా తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer