గురూజీ తదుపరి చిత్రం ఫిక్స్ అయిందా.. కాలేదా?

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ సినిమా ఘన విజయం సాధించడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ‘అజ్ఞాతవాసి’ తో తీవ్రంగా నిరాశపరిచిన గురూజీ ‘అరవింద సమేత’ తో ఫర్వాలేదని అనిపించుకున్నారు. అయితే ‘అల వైకుంఠపురములో’ విజయం మాత్రం త్రివిక్రమ్ కు ఆడియన్స్ లో ఉన్న పట్టును మరోసారి రుజువు చేసింది. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

‘అల వైకుంఠపురములో’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఆరు నెలలు వేచి చూడాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘RRR’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల లేట్ అవుతుందని ఇప్పటికే టాక్ ఉంది. దీంతో త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ టేకప్ చేస్తారా అనే చర్చ సాగుతోంది. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో కూడా త్రివిక్రమ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చిరు ప్రస్తుతం కొరటాల శివ సినిమాకు కమిట్ అయి ఉన్నారు. ఆ సినిమా పూర్తయితే కానీ త్రివిక్రమ్ కు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈలెక్కన మెగాస్టార్ – త్రివిక్రమ్ చిత్రం ఈ ఏడాది లేనట్టే. మరి త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేస్తారా లేదా అప్పటిలోపు మరేదైనా సినిమాను ప్లాన్ చేస్తారా వేచి చూడాలి.
Please Read Disclaimer