త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ ఆయనేనా..?

0

త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారట చిత్ర బృందం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరుగా ఎవర్ని తీసుకోవాలనే విషయం గురించి దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారంట.

అయితే తాజాగా అల వైకుంఠపురంలో చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ ని..ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. థమన్ అల వైకుంఠపురం మూవీకి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడో తెలిసిందే. థమన్ అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ పరంగా పూర్తి న్యాయం చేయగలడని త్రివిక్రమ్ నమ్ముతున్నారట. వీరి ముగ్గురి కలయికలో వచ్చిన ‘అరవిందసమేత వీర రాఘవ’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి గుర్తిండిపోయే బాణీలను అందించిన థమన్ చిత్ర విజయంలో ముఖ్య భూమికను పోషించాడు. థమన్ గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన బృందావనం రామయ్యా వస్తావయ్యా రభస మొదలైన చిత్రాలకు సంగీతం అందించాడు. మే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-