మనసుకు దురద పుడితే గోక్కునే ఆయుధం సంగీతం

0

అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. వేడుక ఆద్యంతం రక్తి కట్టించారు ముందే చెప్పినట్టే. ఇక ఈ వేడుకలో బన్ని- త్రివిక్రమ్- సీతారామశాస్త్రి- అరవింద్ -థమన్ వంటి దిగ్గజాలు సందడి చేశారు. టబు- నివేద పెథురాజ్ అందచందాలు ఈ వేడుకకు ఆకర్షణను పెంచాయి.

వీటన్నిటినీ మించి వేదికపై మాటల మాయావి త్రివిక్రమ్ మాటల మాయాజాలం కట్టిపడేసిందనే చెప్పాలి. బన్ని గురించి మాట్లాడుతూ కూడా ఆయన ప్రాసలు వదిలిపెట్టలేదు. “బన్ని అప్పుడు వేరు. ఇప్పుడు వేరు. అతడు ఇద్దరు పిల్లల తండ్రి. అందుకే బన్ని అనను.. అల్లు అర్జున్ అనే అంటాను. తన స్థాయి పెరిగింది. పరిణతి పెరిగింది. ఇలాంటి కథను ఎంకరేజ్ చేశారు. దర్శకనిర్మాతలంతా సాహసం చేశాం. తప్పులు చేసినా వెంట ఉంటామన్నారు నిర్మాతలు. సక్సెస్ చేసినా వెంట ఉన్నామన్నారు. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్లాం…“ అంటూ త్రివిక్రముడు ఎమోషన్ అయ్యారు. 11 నెలలుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేశాం అంటూ షూటింగ్ ని పొగిడేశారు త్రివిక్రమ్.

అంతేకాదు.. ఈవెంట్ ఆద్యంతం ఆయనలోని ఎమోషన్ ని కవితాత్మకంగా ఆవిష్కరించారు. ఆసక్తికరమైన పదునైన పదజాలంతో త్రివిక్రమ్ స్పీచ్ ఆద్యంతం రక్తి కట్టించింది. “మనసు దురద పెడితే గోక్కునే ఆయుధం సంగీతం..“ అంటూ త్రివిక్రముడు సంగీతానికి ఒక కొత్త డెఫినిషన్ ఇచ్చి అహూతుల్ని నవ్వించారు. అంతేనా.. పాటను ప్రేయసి అని .. అందమైన ఆడ పిల్ల అని పొగిడేసిన తీరు చూస్తే పాట అంటే ఆయనకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. “10/ 20 రూమ్ లో ఒక సోఫా మీద ఒక మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో ఒక పెద్దాయనతో కలిసి క్రియేట్ చేసిన అనుభవాల పాట..కు థమన్ బాణి అంత బాగా కుదిరింది… అంటూ సీతారామశాస్త్రి- థమన్ లపై ఇంట్రో ఇచ్చిన తీరు .. అందుకేగా మాయావి అని అంగీకరించేంతగా ఆయన వర్ణించిన తీరు అద్భుతం.
Please Read Disclaimer