ఇప్పుడు సామి కన్ను పూజాపై పడింది!

0

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కామన్ గా కనిపించే అంశం.. సందర్భానుసారం వచ్చే పంచ్ లు. పంచ్ అనగానే ఏదో పదాల ప్రాసతో విన్యాసం చేసినట్టు కాకుండా అతితక్కువ మాటలతోనే లోతైన అర్థం స్ఫురించేలా అందమైన ప్రాసలో డైలాగ్ లను రాయడంతో గురూజీని మించినవారులేరు. చాలామంది ఆ స్టైల్ ను కాపీ కొడదామని ప్రయత్నించినా బోల్తా పడ్డవారే ఎక్కువ. ఇప్పటికీ ఆవిషయంలో గురూజీని దాటే రచయిత మరొకరు లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

గురూజీ సినిమాల్లో కామన్ గా కనిపించే మరో అంశం ఏంటంటే ఆర్టిస్టులను రిపీట్ చేస్తుంటారు. ఒకసారి పని చేసిన వారితో మళ్ళీ మళ్ళీ పని చేస్తూ ఉంటారు. . త్రివిక్రమ్ సినిమాలో ఒకసారి ఎవరైనా హీరోయిన్ పని చేస్తే.. అదే హీరోయిన్ ను తన నెక్స్ట్ సినిమాల్లో రిపీట్ చేస్తూ ఉంటారు. గతంలో ఇలియానాతో మొదట ‘జల్సా’ సినిమాకు పని చేశారు.. ఆ తర్వాత ‘జులాయి’ లో సేమ్ హీరోయిన్ ను రిపీట్ చేశారు. సమంతా తో ‘అత్తారింటికి దారేది’ సినిమాకు పని చేశారు. సామ్ వర్క్ స్టైల్ నచ్చడంతో ‘S/o సత్యమూర్తి’.. ‘అ ఆ’ చిత్రాలకు పని చేశారు. ఇక ‘అరవింద సమేత’ లో మొదటిసారిగా పూజా హెగ్డేతో పనిచేశారు. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ కొత్త సినిమాకు పూజా హెగ్డే ని రిపీట్ చేస్తున్నారు.

గురూజీకి హీరోయిన్ వర్క్ స్టైల్ నచ్చితే చాలు.. నెక్స్ట్ సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం దాదాపుగా వెతకరని.. వీలైనంతవరకూ ఆ హీరోయిన్ తోనే మరోసరి పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆయనను క్లోజ్ గా ఫాలో అయ్యేవారు చెప్తుంటారు. ఒక రకంగా ఇది హీరోయిన్లకు కూడా కంఫర్టే. ఎందుకంటే డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ తెలిసి ఉంటుంది కాబట్టి అలా సీన్ గురించి చెప్తే చాలు.. ఇలా అల్లుకుపోవచ్చు!Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home