సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్ !

0

టాలీవుడ్ లో ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్. పైకి అలాంటివేం లేదంటూనే కొన్ని సార్లు కలిసొచ్చిన సెంటిమెంట్ ను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తనకి కలిసొస్తున్న ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమా నుండి తన సినిమా టైటిల్ కి ముందు ‘అ’ అక్షరం ఉండేలా చూసుకుంటున్నాడు. ‘అ ఆ’ ‘అరవింద సమేత’ కూడా ‘అ’ తోనే మొదలవుతాయి. లేటెస్ట్ గా బన్నీ సినిమా టైటిల్ ను కూడా ‘అ’ తో మొదలుపెట్టాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ సినిమాకు ముందుగా వైకుంఠపురములో అనే టైటిల్ మాత్రమే అనుకున్నారు. కానీ దానికి ముందు తన సెంటిమెంట్ తో ‘అల’ అనే అక్షరాలు చేర్చాడు గురూజీ.

నిజానికి అ అనే అక్షరం మాత్రమే కాదు మరో సెంటిమెంట్ ను కూడా ఫాలో అవుతున్నారు త్రివిక్రమ్. ‘అ ఆ’ సినిమాకు సమంత నితిన్ ల క్యారెక్టర్ల పేర్లు అనసూయ ఆనంద్ విహారి అని ఫిక్స్ చేసి దాన్ని షార్ట్ కట్ లో ‘అ ఆ’ అని టైటిల్ పెట్టాడు. ఇక మొన్నొచ్చిన ‘అరవింద సమేత’ లో పూజా హెగ్డే క్యారెక్టర్ పేరు ను టైటిల్ ముందు పెట్టాడు. అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే రిపీట్ చేసాడు. సినిమాలో పూజా హెగ్డే పేరు ‘అలకనంద’ అట. అందుకే వైకుంఠపురమంలో కి ముందుగా అల అని హీరోయిన్ క్యారెక్టర్ పేరుని చేర్చాడు.

నిజానికి త్రివిక్రమ్ సెంటిమెంట్ కి హీరోలు కూడా అలవాటు పడిపోతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ పేరుతో టైటిల్ పెడుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా కేవలం త్రివిక్రమ్ చెప్పే కంటెంట్ మీదే శ్రద్ధ పెడుతున్నారు. అసలే వర్కౌట్ అవుతున్న సెంటిమెంట్ కాబట్టి త్రివిక్రమ్ కి నో చెప్పే ఛాన్స్ కూడా లేదు. అందుకే టైటిల్ విషయాన్ని త్రివిక్రమ్ కే వదిలేస్తున్నారు. మరి ‘అల వైకుంఠపురములో’ కూడా గ్రాండ్ హిట్టయితే మాటల మాంత్రికుడు కచ్చితంగా తదుపరి సినిమాలకు కూడా హీరోయిన్ పేరుతో టైటిల్ పెట్టేసి ముందు అ అక్షరం ఉండేలా చూసుకుంటాడనే దాంట్లో సందేహమే లేదు.
Please Read Disclaimer