పవన్ కథలో ఫ్రెండు కెలుకుడు!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ ని తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. రీమేక్ బాధ్యతల్ని దర్శకుడు వేణు శ్రీరామ్ కు అప్పగించారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఈ రీమేక్ ను తెలుగు ఆడియన్ అభిరుచికి తగ్గట్టు పర్ పెక్ట్ గా స్క్రిప్ట్ ని మలిచేదెవరు? వేణూకే ఆ బాధ్యత అప్పగించారా? లేక అంతకు మించిన దిగ్గజాన్ని బరిలోకి దించుతున్నారా? అంటే ఓ ఆసక్తికర సంగతి తెలిసింది.

సాధారణంగా రీమేక్ అంటే స్క్రిప్టులో మార్పులు చేసేది దర్శకుడే. రైటర్లు ఉన్నా దర్శకుడి విజన్ మేరకు రైటర్లు మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే పింక్ రీమేక్ విషయంలో వేణు శ్రీరామ్ ని అంతగా ఇన్వాల్వ్ చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ఆ బాధ్యతలు పవన్ తన స్నేహితుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి అప్పగించినట్లు సమాచారం. త్రివిక్రమ్- వేణు అండర్ స్టాండింగ్ తోనే పింక్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు దిల్ రాజు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.

వేణు శ్రీరామ్ రైటర్ కం డైరెక్టర్. ఇప్పటివరకూ తాను తెరెక్కించినవి రెండు సినిమాలు మాత్రమే. అందుకే తాజా ప్రాజెక్టులో త్రివిక్రమ్ ని బరిలో దించారట. అలాగే గబ్బర్ సింగ్-2 విషయంలో పవన్ కొన్ని తప్పిదాలు చేసినట్లు రిలీజ్ అనంతరం చర్చంశనీయంగా మారింది. ఆ సినిమా బాధ్యతల్ని అప్పుడే దర్శకుడిగా ఎదుగుతున్న బాబికి అప్పగించారు. కానీ రిలీజ్ తర్వాత స్క్రిప్టులో లోపాలున్నాయని విమర్శలొచ్చాయి. దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా గబ్బర్ సింగ్ -2 తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కానీ రొటీన్ కంటెంట్.. స్క్రీన్ ప్లే లోపాలు దెబ్బ కొట్టాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అలాంటి తప్పిదాలు మళ్లీ రిపీటవ్వకుండా పవన్ ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer