ఆ విషయంలో రాజమౌళి వెర్సస్ త్రివిక్రమ్??

0

చాలామంది దర్శకులకు తమ సినిమాలలో నటీనటులను.. టెక్నిషియన్లను రిపీట్ చేసే అలవాటు ఉంటుంది. అందుకే కొందరి సినిమాల్లో ఫలానా నటీనటులు ఉంటారని ఫిక్స్ అయిపోవచ్చు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లయిన ఎస్ఎస్ రాజమౌళి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.

రాజమౌళి విషయమే తీసుకుంటే ఆయన సినిమాలన్నిటికీ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు.. అన్నయ్య కీరవాణి సంగీతం అందిస్తారు. ఇక సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తారు. నటీనటులు కూడా చాలామంది రిపీట్ అవుతూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కూడా టెక్నిషియన్లు వరసగా మూడు నాలుగు సినిమాలకు పనిచేస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్.. సినిమాటోగ్రఫర్ లాంటి వారిని ఊరికే మార్చరు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే తప్పనిసరిగా సునీల్ కు స్థానం ఉండాల్సిందే.

అయితే ఈ ఇద్దరు దర్శకులు ఒకరి టీమ్ లో పని చేసిన టెక్నిషియన్లను.. నటీనటులను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు అసక్తి చూపరని ఓ టాక్ ఉంది. ఇది ఓ రూమర్ అయి ఉండొచ్చు కానీ కొందరు ఆర్టిస్టులు.. కాస్టింగ్ డైరెక్టర్లు మాత్రం ఈ విషయం నిజమే అంటున్నారు. అయితే హీరోల విషయంలో మాత్రం అలా ఉండదట. ఒకరు పని చేసిన హీరోతో మరొకరు పని చేస్తారట.
Please Read Disclaimer