త్రివిక్రమ్ ఫ్యామిలీతో జాని మాస్టర్

0

మాటల మాంత్రికుడు అనే పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అభిమానించేవారు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. ఆయనతో ఒక్కసారి పనిచేస్తే చాలు స్టార్ హీరోలు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. అయితే త్రివిక్రమ్ ఎందుకో కానీ మీడియా విషయంలో కాస్త అంటీముట్టనట్టు ఉంటారు. తనకు సంబంధించిన.. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఇతర డైరెక్టర్లలాగా షేర్ చేసుకోరు. అంతెందుకు.. ఆయన సోషల్ మీడియాలోనే ఉండరు. ఆయన పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాల్లో దేనికి ‘వెరిఫైడ్’ మార్క్ లేదు.

అయితే ఆయనకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలని అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఒక్కోసారి ఆయనకు సన్నిహితంగా ఉండేవారు అలాంటి విశేషాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ “నూతన సంవత్సరం 2020 కి ఇదో హ్యాపీ బిగినింగ్. నేను.. నా కుటుంబం నా ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి ఫ్యామిలీతో గడిపాము. #త్రివిక్రమ్ శ్రీనివాస్ సర్” అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఫోటోలో త్రివిక్రమ్ అమ్మగారు.. సతీమణి సౌజన్య.. ఇద్దరు కుమారులతో పాటు జాని మాస్టర్ సతీమణి.. పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కింది. చాలామంది నెటిజన్లు ఈ ఫోటో షేర్ చేసినందుకు జాని మాస్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Please Read Disclaimer