ఆర్మీ ఐటెం సాంగ్ పై ట్రోల్స్

0

పాకిస్థాన్ ఆర్మీకి ప్రజలకు మద్య వారధిగా ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐ ఎస్ పీ ఆర్) ఉంటుంది. ఆర్మీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఇది పబ్లిక్ కు తెలియజేస్తూ ఉంటుంది. ఆర్మీ కార్యకలాపాలు మరియు ఫొటోలను సోషల్ మీడియా ద్వారా లేదా ఇతరత్ర మీడియా ద్వారా ఈ సంస్థ తెలుపుతుంది. ఇటీవల ఈ సంస్థ ‘కాఫ్ కంగనా’ పేరుతో ఒక సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమా భారత్ పాకిస్తాన్ ల మద్య సాగే కథతో రూపొందిట.

పాక్ వారు నిర్మించిన సినిమా అదీ ఆర్మీకి సంబంధించిన ఒక సంస్థ నిర్మించిన సినిమా అంటే ఖచ్చితంగా భారత్ పై విషం కక్కేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని ఏదో సామెత చెప్పినట్లుగా అత్యుత్సాహం చూపడంతో సొంత దేశస్తులే కాఫ్ కంగనాపై విమర్శలు చేస్తున్నారు. ఆర్మీ సంస్థ డబ్బును ఇలా సినిమాల పేరుతో తగలేయడం ఏంటీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమా విషయమై వివరణ ఇవ్వాలంటూ పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కాఫ్ కంగనా సినిమాలో ఒక ఐటెం సాంగ్ ను పాకిస్తాన్ ఆర్మీ ఆఫీస్ లు మరియు ముఖ్యమైన సైనిక స్థావరాల్లో షూట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఐటెం సాంగ్ ను ప్రముఖ పాక్ స్టార్ నీలమ్ మున్నీర్ చేసింది. ఈ ఐటెం సాంగ్ పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్తానీ మూవీలో ఇలాంటి ఐటెం సాంగ్స్ ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని ఈ విధానం ఇప్పుడు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయమై ఐఎస్ పీఆర్ అధికారులు స్పందిస్తూ ఈ పాటలో నీలమ్ మున్నీర్ భారతీయ యువతిగా కనిపించనుంది. కశ్మీరీలకు ఈ సినిమా మద్దతుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలైన తర్వాత వివాదం అంతా తొలగి పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మున్నీర్ మాట్లాడుతూ ఇది నేను చేసిన మొదటి ఐటెం సాంగ్ అలాగే చివరిది కూడా అంటూ చెప్పుకొచ్చింది. నాకు సందర్బం మరియు కొన్ని ఇతర విషయాలు నచ్చడం వల్ల ఈ ఐటెంసాంగ్ చేసేందుకు ఒప్పుకున్నాను అని.. ప్రేక్షకులు కూడా ఈ ఐటెం సాంగ్ ను స్వాగతిస్తారనే నమ్మకంను నీల్ వ్యక్తం చేసింది.

కాని పాక్ నెటిజన్స్ మాత్రం ఈ పాటపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. సినిమా పేరుతో ప్రజాధనం వృదా చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.. ఆర్మీ సంస్థ సినిమాల నిర్మాణం చేయడం ఏంటీ.. అందులో ఐటెం సాంగ్స్ కూడా పెట్టడం మరీ విడ్డూరం అంటూ నెటిజన్స్ పాక్ ఆర్మీ విభాగంకు చురకలు అంటిస్తున్నారు.
Please Read Disclaimer