విజయ్ సినిమా ..ట్రోలింగ్ అవుతున్న బ్యూటీ

0

టాలీవుడ్ లో ఒక్కో హీరోకి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. దాని బట్టే వాళ్ళ మార్కెట్ డిపెండ్ అవుతుంది కూడా. అయితే విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ కి నచ్చే అంశాలే ఎక్కువ ఉంటాయి. లిప్ లాప్ లు – రొమాన్స్ కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఎమోషనల్ సినిమా అయినా అందులో మసాలా డోస్ లేకపోతే విజయ్ సినిమా చూడలేం అన్నట్టుగా యూత్ ఆడియన్స్ కి అలవాటు చేసారు.

లేటెస్ట్ విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ రిలీజైంది. ఎప్పటిలాగే టీజర్ లో విజయ్ చేసే కొన్ని థింగ్స్ ని ట్రోల్ చేసారు. అక్కడి వరకూ కామనే కానీ ఈసారి విజయ్ తో పాటు రాశీ ను కూడా గట్టిగా ట్రోలింగ్ చేసారు. కొన్ని అశ్లీల సన్నివేశాల్లో స్క్రీన్ షాట్స్ తీసి మరీ పంజాబీ బ్యూటీ ఏంటిది అంటూ గట్టిగానే అడిగారు.

ఇక అమ్మడికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టీజర్ లో షాట్స్ చూసి షాక్ అయ్యారు. వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న రాశీ అసలు ఎందుకు ఈ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer