టవల్ క్వీన్ అని పిలుస్తున్నారు

0

అక్కినేని కోడలు సమంత ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ పై నిరంతరం ఏవో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత చిట్టి పొట్టి దుస్తులతో కనిపించిన ప్రతి సందర్భంలోనూ నెటిజనులు చెలరేగిపోయారు. తనో స్టార్ అని కానీ.. సెలబ్రిటీ కోడలు అన్న సంగతిని కానీ పట్టించుకోని నెటిజనం ఇష్టానుసారం సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ తనకు ఇచ్చిన స్వేచ్ఛా స్వతంత్య్రాలపైనా నిరంతరం అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సామ్ లోని ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ని మెచ్చుకోకుండా ఉండలేని అభిమానులు ఉన్నారు. గత వారం రోజులుగా స్పెయిన్ ఇబిజలో సెలబ్రేషన్ మోడ్ లో ఉన్న సమంత రకరకాల ఫోటోల్ని ఆన్ సైట్ నుంచి అభిమానులకు షేర్ చేశారు. ఇప్పటికే కింగ్ నాగార్జున అండ్ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు రిలీజయ్యాయి. వీటితో పాటు తాజాగా రివీల్ చేసిన ఓ సోలో ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సమంత ఓ ఖరీదైన పింక్ పర్పుల్ డిజైనర్ డ్రెస్ లో కనిపించి మైమరిపించారు. ఈ డ్రెస్ లో సామ్ కాస్తంత హాట్ గానే కనిపిస్తుండడంతో కుర్రకారు నుంచి కామెంట్లు అంతే ఇదిగా వినిపిస్తున్నాయి.

ఈ ఫోటోకి యథాతథంగా టీనేజీ సెక్షన్ నుంచి ట్రోల్స్ తప్పడం లేదు. సమంత ఇలా టవల్ చుట్టుకోవడం బాలేదని కొందరు కామెంట్లు చేస్తుంటే.. చైతన్య ఇక టవల్స్ కొనొద్దని సూచించారు కొందరైతే. మరీ బాగా సన్నబడిపోతున్నావెందుకిలా! అంటూ కొందరు బాధను వ్యక్తం చేశారు. అయితే ఇంత బ్యాలెన్స్ డ్ గా రూపలావణ్యాన్ని మెయింటెయిన్ చేయాలంటే అందుకు ఎంతగా శ్రమించాలో సామ్ కి మాత్రమే తెలుసన్నది ఆకతాయిలకు తెలియకపోవచ్చు. అక్కినేని కోడలు హోదాలో చేనేతకు ప్రచారం చేసినా.. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ దుస్తులకు ప్రచారం చేసినా.. బంగారు ఆభరణాలు .. కంచి పట్టు చీరలకు ప్రచారం చేసినా సామ్ నే చేయాలి! అన్నంతగా పాపులారిటీ ఉంది. వీటన్నిటి దృష్ట్యా సమంత ఎప్పటికప్పుడు సంథింగ్ స్పెషాలిటీ ఉన్న డిజైనర్ లుక్ లో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారన్నది గుర్తుంచుకోవాలి.
Please Read Disclaimer