పరువు తీస్తున్నారు.. స్టార్ హీరో భార్యపై ట్రోల్స్

0

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వరుసగా ఫ్లాప్ అవుతున్నా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గదు. సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచిన షారుఖ్ ఖాన్ ఈమద్య కాలంలో కాస్త డల్ అయ్యాడు. అయినా కూడా మళ్లీ షారుఖ్ పుంజుకుంటాడని అతడి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక షారుఖ్ ఖాన్ భార్య తాజాగా వార్తల్లో నిలిచింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది.

షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన ఇంట్లో ఉన్న ఒక న్యూడ్ పెయింటింగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పెయింటింగ్ తమ ఇంటి ఇంటీరియర్ ను మరింత అందంగా మార్చి వేసింది అంటూ కామెంట్ చేసింది. ఆ పెయింటింగ్ మరీ దారుణంగా ఉంది. ఇద్దరు మగాళ్లు ఒక మహిళను హింసిస్తూ రేప్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ ముగ్గురు కూడా పూర్తి న్యూడ్ గా కూడా ఉన్నారు. ఇది రొమాంటిక్ అని గౌరీ ఖాన్ అనుకుంటుంది కాని ఆ ఆర్ట్ మాత్రం ఏ ఒక్కరిని మెప్పించడం లేదు.

ఇంట్లో ఇలాంటి పెయింటింగ్స్ ఏంటీ అంటూ సోషల్ మీడియాలో గౌరీ ఖాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ పరువు తీసే పనులు మీరు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి తక్కువ పనులు చేసి ఆయన్ను మరింత ఇబ్బంది పెట్టవద్దంటూ ఒక వ్యక్తి గౌరీ ఖాన్ కు కామెంట్ చేశాడు. ఇంకా పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. న్యూడ్ ఫొటోలను ఇంట్లో పెట్టుకోవడం మరీ విడ్డూరం… అలాంటిది మరీ దారుణంగా ఒక మహిళను ఇద్దరు పూర్తి నగ్నంగా మార్చి రేప్ చేస్తున్న పెయింటింగ్ ను పెట్టుకోవడం.. అదో గొప్ప విషయం అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గౌరీ ఖాన్ టార్గెట్ అయ్యింది. మరి ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేయడంతో పాటు.. ఇంట్లోంచి ఆ పెయంటింగ్ ను తీస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer