టక్ జగదీష్ .. మరో ఇంటెన్స్ లవ్ స్టోరీ?

0

చక్కని లవ్ స్టోరి.. ఫ్యామిలీ ఎమోషన్స్ .. సెన్సిబిలిటీస్ తో సినిమాలు తీస్తూ శివ నిర్వాణ తనకంటూ ఓ స్టైల్ ని ఆపాదించుకున్నాడు. అతడి సినిమాల్లో ఎమోషనల్ కంటెంట్ తెలుగు ఆడియెన్ కి బాగా కనెక్టవుతోంది. 2019లో నాగచైతన్య- సమంత జంటకు మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కానుకగా ఇచ్చాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాతో రక్తి కట్టించడం వల్లనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. నాని హీరోగా నిన్ను కోరి ఈ తరహా ప్రయత్నమే. మరోసారి అతడు నాని హీరోగా టక్ జగదీష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ లాంఛనం గా ప్రారంభమైంది. తొలి పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ లో నానీ టక్ సవరించుకుంటూ స్టైలిష్ గా కనిపించాడు. ఆ చేతి కడియం చూడగానే మధ్య తరగతి యువకుడిగానే ఎమోషనల్ పాత్రలో కనిపించనున్నాడని అర్థమవుతోంది. శివ నిర్వాణ సినిమా అనగానే ఘాడమైన ప్రేమకథ ఉంటుంది కాబట్టి నానీతో మరోసారి ఆ తరహా ప్రయత్నమే చేస్తున్నాడని అర్థమవుతోంది. నాని సరసన ఈ చిత్రంలో రీతూ వర్మ- ఐశ్వర్య రాజేష్ నాయికలు గా నటిస్తున్నారు. గ్లామర్ కి అంతగా ఆస్కారం లేని నాయికల్ని ఎంపిక చేసుకున్నాడు అంటే ఫ్యామిలీ కంటెంట్ .. రెగ్యులర్ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాడనే అర్థమవుతోంది.

రెగ్యులర్ గా ఫ్యామిలీ స్ లో కనిపించే ఎమోషన్స్ ని తెరపై పండించగలిగితే హిట్టు కొట్టడం కష్టమేమీ కాదన్నది శివ నిర్వాణ నిరూపించారు కాబట్టి.. ఈసారి కూడా అదే ఫార్ములాని అప్లయ్ చేస్తున్నారని అర్థమవుతోంది. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 11 నుంచి పొలాచ్చిలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం.
Please Read Disclaimer