ఇలా నానికే సాధ్యమేమో..!

0

యంగ్ హీరో నాని ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘టక్ జగదీష్’ దాదాపుగా పూర్తి అయ్యింది. ఆ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు పడే ఇబ్బందుల గురించి మరియు ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరిని సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే శివ నిర్వాన చేసిన సినిమాల హీరోల పాత్రలు చూస్తే ఖచ్చితంగా నాని ఇందులో విభిన్నమైన పాత్రనే చేసి ఉంటాడు అనే టాక్ వస్తుంది. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని ఇప్పటి వరకు కెరీర్ లో పోషించని పాత్రను చేస్తున్నట్లుగా చెబుతున్నాడు.

ట్యాక్సీవాలా వంటి విభిన్నమైన సినిమాను అందించిన రాహుల్ శ్యామ్ సింగరాయ్ లో నానిని ఎలా చూపిస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు కాని విభిన్నంగా ఉంటాడనే నమ్మకం మాత్రం అందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల నాని.. వివేక్ ఆత్రేయల కాంబోలో ప్రకటించబడ్డ మూవీ ‘అంటే సుందరానికి’ మూవీ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందట. నాని సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు గురి ఎక్కువగా ఉంటుంది. కనుక వారిని ఆకట్టుకోవడంతో పాటు యూత్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా కాస్త బోల్డ్ కంటెంట్ ను కూడా జోడించి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

నాని ఈ మూడు సినిమాలను కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే సారి మూడు విభిన్నమైన సినిమాల్లో.. విభిన్నమైన పాత్రల్లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. సహజ నటుడు అయిన నానికే అది సాధ్యం అవుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు సినిమాలు కూడా భారీ అంచనాలను కలిగి ఉన్నాయి. కనుక ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయనే నమ్మకంను నాని ఫ్యాన్స్ కలిగి ఉన్నారు.