స్టన్నింగ్ బ్యూటీ జ్యూసీ లిప్స్

0

హిందీ సినిమా ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు వాణి కపూర్. ‘శుద్ద్ దేశి రొమాన్స్’.. ‘బేఫిక్రే’ లాంటి సినిమాల బోల్డ్ గా నటించి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది. అయితే వాణి కెరీర్ లో ఇప్పటి వరకూ పెద్ద హిట్ ఒకటి కూడా లేదని అంటూ ఉండేవారు కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘వార్’ ఆ లోటును తీర్చేసింది. మొదటి సారి తన ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. మామూలుగానే హాట్ లేడీ.. ఇక విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరింతగా రెచ్చిపోతోంది.

ఈ సంగతి ఆమె ఇన్స్టా పోస్టులు చూస్తేనే మనకు తెలుస్తుంది. వాణి నిన్న సాయంత్రం తన ఇన్స్టా ఖాతాలో కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. చాలా డీప్ గా ఉండే వి-నెక్ ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి సూపర్ పోజులిచ్చింది. మెడలో ఒక లాంగ్ హ్యాంగింగ్ పెండెంట్ ఉండే చెయిన్ ధరించి చిరునవ్వులు రువ్వుతూ స్టైల్ గా నిలుచుంది. మెరిసే లిప్ స్టిక్ కలర్.. తీరైన మేకప్ తో సెగలు రేపుతోంది.

ఈ ఫోటోలకు నెటిజన్లు తనివితీరా స్పందించారు. “మగజాతిపై బ్యూటీ వార్”.. “షైనీ షైనీ వాణి”.. “స్టన్నింగ్ బ్యూటీ.. జ్యూసి లిప్స్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే వాణి ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న ‘షంషేరా’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer