టీవీ నటి న్యూడ్ యోగా ప్రకంపనాలు!

0

యోగాలో రకరకాలు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా రకరకాల యోగ భంగిమల్ని పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీ యోగాలో ఎన్నో కొత్త రకం యోగాసనాల్ని చూస్తున్నాం. నిరంతరం యూట్యూబ్ లో ఇదో పెద్ద వ్యాపారంగా మారింది. మానసిక.. శారీరక ఆరోగ్యం బావుండాలంటే.. అన్నిరకాల ఒత్తిడుల నుంచి బయటపడాలంటే యోగా తప్పనిసరిగా మారింది. ఆ క్రమంలోనే యోగా వీడియోలకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్న `న్యూడ్ గర్ల్ యోగా` హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ టీవీ నటి.. డ్యాన్సర్ అబిగైల్ పాండే టాప్లెస్ యోగాను మనకు పరిచయం చేస్తున్నారు. సనాతన భారతదేశంలో ఈ తరహా యోగా పరిచయం లేదనే చెప్పాలి. చాలా అరుదుగా మాత్రమే ఈ తరహాలో ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే మనకు పరిచయం చేసేందుకు టీవీ నటి అబిగైల్ ఏమాత్రం సిగ్గు పడకపోవడంపై వాడి వేడిగా చర్చ సాగుతోంది. తాజాగా ఈ నటి ఇన్ స్టా ఖాతాలో ఓ న్యూడ్ యోగా స్టిల్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటో క్షణాల్లో జోరుగా వైరల్ అయిపోయింది. అబిగైల్ కి చెందిన న్యూడ్ యోగా వీడియో ఒకటి అంతే జోరుగా వెబ్ లో దూసుకెళుతోంది.

న్యూడ్ యోగా గర్ల్ అంతర్జాలంలో ఫేమస్. ఆ తరహా ప్రయత్నమిది. అదేమిటో మీ అందరికీ తెలియకపోవచ్చు. కానీ అందులో ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా ఉంది. అయినా ఒక పుస్తక ముఖచిత్రం ద్వారా తీర్పునివ్వడం సరి కాదని మనకు తెలియదా? యోగాను నగ్నంగా చేయాలని లేకపోవచ్చు. ఏదైనా మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది“ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అబిగైల్. తొలుత ఈ నగ్న ఫోటోని షేర్ చేసేందుకు సిగ్గు పడ్డానని.. భయపడ్డానని తెలిపిన సదరు టీవీ నటి ప్రస్తుతం రిలాక్స్ డ్ గా ఉందిట. అబిగైల్ హిందీలో `నాచ్ బలియే` అనే రియాలిటీ షోతో పాపులరయ్యారు. న్యూడ్ యోగాతో ఇప్పుడు మరింత పాపులారిటీ వచ్చేస్తోంది.
Please Read Disclaimer