పుసుక్కున చైతు సినిమా సంగతి చెప్పేసిన ఛానెల్!

0

అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చైతు డెబ్యూ సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకూ చైతు-దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను మేము తీసుకున్నామంటూ ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని టీవి ప్రకటించింది. నాగ చైతన్య-రష్మిక మందన్న సినిమా ‘అదే నువ్వు అదే నేను’ సినిమా శాటిలైట్ రైట్స్ జెమిని టీవీ ఛానెల్ తీసుకుందని సగర్వంగా ప్రకటించింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ సినిమా గురించి దిల్ రాజు నుండి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. షూటింగ్ సంగతి కూడా తెలియదు.. సినిమా టైటిల్ కూడా తెలియదు.. ఇవన్నీ నిర్మాతలు ప్రకటించేలోపే పుసుక్కున ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు అయింది.

నిజానికి ఈ టైటిల్ తో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ను పరిచయం చేస్తూ ఒక సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. అదే కథతో ఇప్పుడు రాజ్ తరుణ్-షాలిని పాండేతో దిల్ రాజు సినిమా చేస్తున్నారు. ఇక టైటిల్ మాత్రం రాజ్ తరుణ్ కోసం వాడకుండా చైతు సినిమాకు ఫిక్స్ చేశారన్నమాట. ఏదేమైనా టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Please Read Disclaimer