ఒక్క సోలో హిట్ కొట్టి మాట్లాడు అంటూ ఛాలెంజ్

0

సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో పరిస్థితి వేడెక్కింది. షూటింగ్స్ లేని కారణంగానో లేదా మరేంటో కాని గత నెల రోజులుగా సుశాంత్ మృతి పై చర్చ జరుగుతూనే ఉంది. ఆయన మృతిపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బాలీవుడ్ మాఫియా అంటూ కొందరు నిర్మాతలను ఆమె టార్గెట్ చేస్తూ ఉన్న వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇదే సమయంలో ఆమె హీరోయిన్ తాప్సిని కూడా టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. మొదటి నుండి తాప్సి కంగనాల మద్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. తాజాగా తాప్సిని బి గ్రేట్ హీరోయిన్ అంటూ కంగనా కామెంట్ చేసిన విషయం తెల్సిందే.

కంగనా బి గ్రేడ్ కామెంట్స్ కు తాప్సి తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. తాను గతంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో మాట్లాడని కంగనా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది. కంగనాకు ఇతరులకు సాయం చేసే గుణం అస్సలు లేదు అంటూ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ కంగనా స్పందించింది. ఇప్పటి వరకు ఒక్క సోలో సక్సెస్ లేని తాప్సి నా గురించి మాట్లాడేందుకు అర్హురాలు కాదు అంది. తన కెరీర్ లో క్వీన్.. తను వెడ్స్ మను.. మణికర్ణిక వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. నాలా నువ్వు ఒక్క సోలో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత నాపై విమర్శలు చేయాలంటూ తాప్సిని కంగనా ఛాలెంజ్ చేసింది.Please Read Disclaimer