సౌత్ రీమేక్ కు ఓకే చెప్పిన బాలీవుడ్ ఖాన్స్

0

తమిళ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్ వేదా’ను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఏడాది నుండే ఈ రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమా రీమేక్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. సమ్మర్ లో రీమేక్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా మహమ్మారి కరోనా కారణంగా మొత్తం ప్లాన్స్ తారుమారు అయ్యాయి.ఎట్టకేలకు విక్రమ్ వేదా చిత్రంలో నటించబోతున్న హీరోలు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇంకా మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్. వీరిద్దరు కలిసి సౌత్ మూవీ రీమేక్ లో నటించబోతున్నారు. అమీర్ ఖాన్ ప్రస్తుత చిత్రం ‘లాల్ సింగ్ చద్ద’ చిత్రం షూటింగ్ సగంలో ఉంది. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ రీమేక్ ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు వచ్చే ఏడాదిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఈ రీమేక్ పట్టాలెక్కబోతుంది. అప్పటి వరకు అమీర్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు వారి కమిట్ మెంట్స్ ను పూర్తి చేయనున్నారు. హిందీ విక్రమ్ వేదా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Please Read Disclaimer